తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా( Congress ) ఎగురవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నుంచి అగ్ర నాయకులు వరకు లక్ష్యంగా పెట్టుకున్నారు.బిఆర్ఎస్, బిజెపిల కంటే దీటుగా కాంగ్రెస్ ను జనాల్లోకి తీసుకువెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను , విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా పనిచేస్తే విజయం కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని, ఇక ఈ వంద రోజులు అన్నిటినీ పక్కనపెట్టి ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్( General Secretary of AICC KC Venugopal ) నిన్న గాంధీభవన్ లో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.
” వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం, అభ్యర్థుల ఎంపికపై ముమ్మర ప్రచారంపై దృష్టి పెట్టాలి .ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15లోగా నాలుగు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి.వచ్చే నెల రెండో వారానికల్లా వీలైనాన్ని ఎక్కువ స్థానాలను, అభ్యర్థులను ప్రకటించాలి” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందుగా పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతోను, తర్వాత పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీతోను కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీపాదాస్ మున్షి తో పాటు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( PCC Chief Revanth Reddy ) పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే , సీనియర్ నేతలు జానారెడ్డి( Jana Reddy ) , ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి .హనుమంతరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ,రేణుక చౌదరి , సంపత్ కుమార్ , మహేష్ కుమార్ గౌడ్, వంశీధర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 35 చోట్ల, పార్టీ బాగా వెనకబడి ఉందని, వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని వేణుగోపాల్ సూచించారు.
జహీరాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ తో పాటు, మరో పట్టణంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సభలకు కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరవుతారని వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వస్తే ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీలు మహిళల సంక్షేమానికి ఏం చేస్తామో ప్రజలకు చెప్పాలని పార్టీ నాయకులకు వేణుగోపాల్ సూచించారు.ఈ నెల 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ముఖ్య నేతలు అంతా గిరిజన తండాల్లో ఒకరోజు బస చేసి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.
అలాగే బీసీలకు టిక్కెట్లు కేటాయించే నియోజకవర్గం లిస్టును త్వరలోనే విడుదల చేయనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు.వచ్చే వంద రోజులు విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని, నాయకులు మధ్య ఐకమత్యం లేకపోవడం వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చిందని, ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు.