బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ను దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ ( Lokesh kanagaraj ) ఒక్కసారిగా పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ గా మారిపోయాడు.ముఖ్యంగా కమల్ హాసన్ తో రూపొందించిన విక్రమ్ సినిమా( Vikram Movie ) ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రతి ఒక్కరం చూశాం.
కమల్ పనైపోయింది అనుకున్న వారు కూడా నోరు వెళ్లబెట్టే విధంగా ఏకంగా అయిదు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసే విధంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేశాడు అంటే ఏ స్థాయిలో లోకేష్ పనితనం ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.విజయ్( Thalapathy Vijay ) తో ఈయన రూపొందించిన లియో సినిమా( LEO ) భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరు కూడా లోకేష్ కనగరాజ్ పై ఉన్న నమ్మకం తో మొదటి రోజు మొదటి ఆట సినిమా ను చూసేందుకు సిద్ధం అయ్యారు.
అయితే సినిమా తీవ్ర నిరాశ పరిచింది.లోకేష్ సినిమా నేనా… మరెవ్వరి సినిమాకు అయినా వచ్చామా అన్నట్లుగా లియో ఉంది.సినిమా లను స్పీడ్ గా ముగించాలి… .
ఎక్కువ సినిమా లను తీసుకు రావాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్( Lokesh kanagaraj ) భావిస్తున్నాడేమో కానీ ఈ సినిమా మరీ దారుణంగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి సినిమా ను జనాలు ఆధరిస్తారు అనుకోవడం హీరో విజయ్ కి మరియు దర్శకుడు లోకేష్ కి ఏమాత్రం సబబు కాదు.ముందు ముందు అయినా హీరో ఇలాంటి కథలు ఎంపిక చేసుకోకుండా ఉండాలి అంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.
లియో కి ముందు వరకు లోకేష్ కనగరాజ్ చేతిలో పది కి పైగా సినిమాలు ఉన్నాయి అన్నట్లుగా అనిపించింది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు.
లోకేష్ కనగరాజ్ మళ్లీ బ్లాక్ బస్టర్ కొడితే తప్ప ఆయన్ను నమ్మే అవకాశం లేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి లోకేష్ తన సత్తా ను చాటుకుంటాడా అనేది చూడాలి.