టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ భామ సోనాలి బింద్రే.తెలుగులో దాదాపు అందరు స్టార్స్ తో కలిసి నటించింది.ఆమె చేసిన సినిమాలన్ని తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి.2013లో సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రేమించిన వాడిని పెళ్లాడిన సోనాలి బింద్రే. క్యాన్సర్ బారిన పడి నరకం చూసింది.న్యూయార్క్ లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరుపుకున్న ఈ అమ్మడు ఎలాగోలా మహమ్మారి నుండి బయటపడింది.
ఇక మళ్లీ తిరిగి ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్న ఈ అమ్మడు తిరిగి సినిమాల్లో నటించాలని చూస్తుంది.ఈ క్రమంలో ఎన్.
టి.ఆర్ 30వ సినిమాలో సోనాలి బింద్రే నటిస్తుందని టాక్.సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో సోనాలిని తీసుకుంటున్నారని తెలుస్తుంది.అయితే సోనాలి ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సోనాలికి ఇక్కడ గ్రాండ్ వెల్ కం లభిస్తుందని చెప్పొచ్చు.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సోనాలి తప్పకుండా రీ ఎంట్రీతో అలరిస్తుందని అంటున్నారు.