సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అదితి రావు హైదరి( Aditi Rao Hydari ) ఒకరు ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ హీరోయిన్గా గుర్తింపు పొందారు.అయితే ఈ మధ్య కాలంలో ఈమె నటుడు సిద్ధార్థ్( Siddharth ) తో కలిసి చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ కనిపిస్తున్నారు.
ఇక ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయినప్పటికీ ఈ వార్తలు పై ఈమె ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇలా నటుడు సిద్ధార్థ్ తో కలిసి ఈమె చేస్తున్న హంగామా మామూలుగా లేదని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సినీ మీడియా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు.ఈ సినిమాల గురించి ఎన్నో రకాల ప్రశ్నలను వాటి నుంచి సమాధానాలు రాబట్టారు.అదితిని ప్రశ్నిస్తూ.
ఒక యాక్టర్ గా మీరు ఏం వినకూడదు అనుకుంటున్నారు అంటూ ఈమెను ప్రశ్నించడంతో ఈమె సమాధానం చెబుతూ.ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఈ సినిమా హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం( Heroine Centric Film ) అని నేను వినకూడదు అని అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పారు.

ఇక ఎవరూ కూడా హీరోల వద్దకు వెళ్లి ఇది హీరో సెంట్రిక్ సినిమా అని చెప్పలేరు కదా.అలాగే తన వద్దకు కూడా ఎవరైనా వచ్చి ఇది హీరోయిన్ సెంట్రిక్ అని చెప్పడం నేను వినకూడదు అనుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మన కథ చెప్తాము అంతే అందరూ కథలు చెప్పడానికే ఇక్కడ ఉన్నారు.కానీ మహిళా నటుల( Female Actors ) దగ్గరకు వచ్చి మాత్రం ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా( Lady Oriented Movie ) అని కథ చెప్తారు.
ఆ మాట వినకూడదు అనుకుంటాను అని తెలిపింది.దీంతో ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.