ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది.పార్టీ నేతగా ఉన్న కంది శ్రీనివాస్ రెడ్డిని మరో వర్గానికి చెందిన నాయకులు అడ్డుకున్నారని తెలుస్తోంది.
కాగా ఇటీవలే డీసీసీ అధ్యక్షుడిపై శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఏర్పాటైన పార్టీ సమావేశంలో ఇరు వర్గాలకు చెందిన పలువురు నేతల మధ్య వివాదం చెలరేగింది.
అది కాస్తా ముదరడంతో నాయకులు కొట్టుకున్నారు.తరువాత కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు సభ నుంచి వెళ్లిపోయారని సమాచారం.