మరో చరిత్ర వంటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది సరిత. సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మారి స్టార్ హీరోయిన్స్ అందరికి తన గాత్రాన్ని అందించింది.
సావిత్రి తర్వాత నలుపు రంగు ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీ లో రాణించడం అంటే అది కేవలం సరితకు మాత్రమే చెల్లింది.ఇక హీరోయిన్ గా సౌత్ ఇండియా లోని అన్ని భాషల్లో ఏకంగా 500 సినిమాల్లో నటించింది.
ఇక ఒక హీరోయిన్ గా ఆమె అనేక సినిమాల్లో టైం లేకుండా నటిస్తున్నప్పటికీ అంతే బిజీ గా ఏక కాలంలో చాల మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడం అనేది మాములు విషయం కాదు.
ఆమె సినిమాలహాతో పాటు ఆమె టైం లో అన్ని సినిమాల్లో ఆమె గొంతు వినిపించిన ఎవ్వరు గుర్తు పట్టే వారు కాదు.
అంతలా ఆమె గొంతులో వేరియేషన్స్ ఉంటూ మాయాజాలం చేసేది.ఇక సినిమా ల్లో హీరోయిన్ గా కెరీర్ ముగిసిన కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే చాల ఏళ్ళ పాటు కొనసాగడం విశేషం.
సరిత కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించింది.తన ప్రాణ స్నేహితురాలు అయినా హీరోయిన్ రాధికా కోసం రాడాన్ మీడియా సంస్థ లో కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.
సరిత సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆమె వ్యక్తి గత జీవితం మాత్రం ఒక సంచలనం అనే చెప్పాలి.
మొదటగా ఆమె వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని పెద్దల సమక్షంలో వివాహమాడింది.ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావడ తో అతడికి విడాకులు ఇచ్చి పూర్తిగా సినిమాల్లో బిజీ అయ్యింది.సినిమా ఇండస్ట్రీ లో సెటిల్ అయినా తర్వాత సినిమాలకు కెమెరా మ్యాన్ గా పని చేసే నవ కాంత్ అనే వ్యక్తి తో ప్రేమలో పడింది.
కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే అతడు ప్రమాదంలో మరణించడం తో సరిత ఒంటరిగా మిగిలిపోయింది.
ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాల సమయం పట్టగా, సినిమాల్లో తన తో నటించిన ముకేశ్ అనే తమిళ యాక్టర్ తో మరోమారు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు కొడుకులు పుట్టాక ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రాగా విడాకులు తీసుకొని ప్రస్తుతం దుబాయ్ లో కొడుకులతో కలిసి జీవిస్తుంది.