కాపు ఎమ్మెల్యేలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు కొట్టు, బొత్స, అంబటిలు ఖండించారు.టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కుమ్మక్కయారని మంత్రి కొట్టు ఆరోపించారు.
కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా చంద్రబాబు, పవన్ లు మాట్లాడారని మండిపడ్డారు.పవన్ విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
పవన్ వ్యాఖ్యలతో కాపు సామాజిక వర్గం బాధపడుతోందని మంత్రి కొట్టు తెలిపారు.గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగానే చూశాయని మంత్రి బొత్స అన్నారు.
టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.