ఒకప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.ఎప్పుడైతే వీరికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ అవుతాయో అలాంటి సమయంలో బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తుంటారు.
ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది వెండితెర తారలు బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.కేవలం కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇప్పటికే బుల్లితెరపై ఆమని, రాశి, రోజా, ఇంద్రజ వంటి సీనియర్ తారలు బుల్లితెరపై పలు కార్యక్రమాలు, సీరియల్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా గతంలో హీరోయిన్ సంగీత కూడా జీ తెలుగులో బిందాస్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే వారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం చిత్రంలో ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగుతో అందరి మన్ననలు పొందిన సంగీత ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఈమెకు ప్రధాన పాత్రలలో అవకాశాలు తగ్గిన తర్వాత సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.
ఇలా వెండితెరపై పలు పాత్రలలో నటించిన తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గడంతో వెంటనే బుల్లితెర పై బిందాస్ అనే కార్యక్రమం ద్వారా తనదైన శైలిలో ప్రేక్షకుల్ని సందడి చేశారు.అయితే అప్పట్లో ఈ కార్యక్రమానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండేది.
ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు వచ్చి తమదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే వారు.
సాధారణంగా అన్ని కార్యక్రమాలు ప్రైస్ మని లక్షలతో ప్రారంభమై క్రమంగా వారి ఆట తీరును బట్టి వారి గెలుచుకోవడం చూస్తుంటాము.
కానీ ఈ కార్యక్రమం మాత్రం కేవలం ఒక్క రూపాయితో ప్రారంభమై రెండు రౌండ్ లు పూర్తయ్యే లోపు ఏకంగా లక్షలు గెలుచుకునే వారు.ఈ కార్యక్రమానికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్ లు హాజరయ్యేవారు.
ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఈ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచే వారు.

ఇలా బిందాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసిన సంగీత ఆ తర్వాత మరే ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెర పై సందడి చేయలేదు.ఇకపోతే సంగీత సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఈమె హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు.
ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఈమె నటించిన సినిమా మంచి విజయం అందుకోవడంతో తిరిగి సంగీత పలు సినిమాలలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.