హీరో అఖిల్ వల్ల ప్రముఖ నటి ఆమనికి సొంతమైన ఈ రేర్ రికార్డ్ గురించి తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ నటి ఆమని( Aamani ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదానినని ఆమె తెలిపారు.

 Actress Aamani Rare Record With Akhil Akkineni Movies Details, Actress Aamani ,-TeluguStop.com

రాత్రి 12 గంటల సమయంలో కజిన్స్ ను నిద్ర లేపి మొత్తం పూలు కట్ చేసేదానినని ఆమని పేర్కొన్నారు.దొంగతనం చేసిన పూలను పెట్టుకోలేమని పెట్టుకుంటే తెలిసిపోతుందని ఆమె తెలిపారు.

జామకాయలు, సీతాఫలాలు కూడా దొంగతనం చేసేదానినని అమని చెప్పుకొచ్చారు.

నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.

నాన్నకు సేవలు చేయాలని అనుకున్నానని ఆయన మరణం నన్ను బాధ పెట్టిందని ఆమని వెల్లడించారు.జంబలకిడిపంబ( Jambalakidipamba Movie ) రెమ్యునరేషన్ తో ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నానని ఆమె అన్నారు.

మదర్ ఉన్నారని మూవీ ఆఫర్ల కోసం నాన్నను వదిలి చెన్నైకు వచ్చామని ఆమని కామెంట్లు చేశారు.ఇప్పటికీ అమ్మకు నేను కెరీర్ పరంగా బిజీగా ఉండటం ఇష్టమని ఆమె తెలిపారు.

Telugu Aamani, Aamani Akhil, Aamani Rare, Actress Aamani, Akhil Akkineni, Mother

చిన్నప్పుడు అఖిల్ పై( Akhil ) తెలియని ప్రేమ అని ఇప్పటికీ అఖిల్ ప్రేమతో మాట్లాడతాడని ఆమని అన్నారు.ఇప్పుడు అఖిల్ చాలా క్యూట్ గా ఉన్నాడని ఆమని అన్నారు.అఖిల్ చిన్న వయస్సులో ఉన్న సమయంలో సిసింద్రీ మూవీలో( Sisindri Movie ) అఖిల్ కు తల్లిగా చేశానని అఖిల్ పెద్దైన తర్వాత కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో( Most Eligible Bachelor ) తల్లిగా చేశానని ఆమె పేర్కొన్నారు.ఈ విధంగా ఒక హీరో చిన్నప్పుడు, పెద్దయ్యాక తల్లిగా చేయడం నాకే సాధ్యమైందని ఈ రేర్ రికార్డ్ నాకే సొంతమని ఆమె తెలిపారు.

Telugu Aamani, Aamani Akhil, Aamani Rare, Actress Aamani, Akhil Akkineni, Mother

భరత్ అనే నేనులో( Bharat Ane Nenu ) మహేష్ తో చేశానని ఆమని వెల్లడించారు.ఆ సినిమా చూసి ఎంతోమంది ఫోన్ చేశారని ఆమె కామెంట్లు చేశారు.భరత్ అనే నేను కోసం కేవలం మూడు రోజులు పని చేశానని ఆమని అన్నారు.ఆమని కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఆమని పారితోషికం కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఆమని సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఆమని నటిస్తే బాగుంటుందని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube