గద్దర్ మృతి పట్ల సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం..!!

ప్రజా గాయకుడు గద్దర్( Gaddar ) నేడు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించడం తెలిసిందే.ఇటీవల గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చివరకు ఆరోగ్యం విషమించి నేడు తుది శ్వాస విడిచారు.

 Actor Tdp Mla Balakrishna Mourns Gaddar's Death , Tdp Mla Balakrishna, Gaddar-TeluguStop.com

గద్దర్ మృతి పట్ల రాజకీయ నాయకులు సెలబ్రిటీలు( Celebrities ) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త పార్టీతో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసిన క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇక ఇదే సమయంలో సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ( MLA Balakrishna ) సంతాపం వ్యక్తం చేశారు.ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది.“తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.గద్దర్ ఓ విప్లవశక్తి.

ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు.ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు.

గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”అని బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube