గద్దర్ మృతి పట్ల సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం..!!
TeluguStop.com
ప్రజా గాయకుడు గద్దర్( Gaddar ) నేడు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించడం తెలిసిందే.
ఇటీవల గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చివరకు ఆరోగ్యం విషమించి నేడు తుది శ్వాస విడిచారు.
గద్దర్ మృతి పట్ల రాజకీయ నాయకులు సెలబ్రిటీలు( Celebrities ) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పార్టీతో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసిన క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇక ఇదే సమయంలో సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ( MLA Balakrishna ) సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది."తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.
గద్దర్ ఓ విప్లవశక్తి.ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు.
ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు.గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"అని బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది ఏం బ్రతుకు అంటూ ఎమోషనల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఏం జరిగిందంటే?