Actor Rajanala : ఒక నటుడి శవం కోసం ఫ్లైట్ పంపిన చంద్ర బాబు..ఏం జరిగింది ?

చాల సార్లు మనం రాజకీయ నాయకులు ఏమి చేయరు అనుకుంటాం.కానీ వారు చేసేవి అందరికి తెలియాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు.

 Actor Rajanala : ఒక నటుడి శవం కోసం ఫ్లైట�-TeluguStop.com

అలంటి ఒక ఉదాహరణ చంద్ర బాబు నాయుడు గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మీకు నటుడు రాజనాల( Rajanala Kaleswara Ra ) గుర్తుండే ఉండచ్చు.

టాలీవుడ్ లో హీరో ఎవరైనా కూడా విలన్ రాజనాల ఉండాలని అప్పట్లో ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత అనుకునేవారు.రాజనాల ను చూస్తే లేడీస్ అంత కూడా ఆయనను చూస్తే చాలు భయంతో వణికిపోయే వారు.

రాజనాల సినిమా లోకి రాకముందు, వచ్చాక కూడా బాగా లక్సరీ గా బ్రతికాడు.కానీ అనవసరపు పోకడలు, వ్యసనాలకు పోయి ఆర్థికంగా చితికిపోయాడు.

Telugu Chandrababu, Jayalalithaa, Murali Mohan, Rajanala, Rajanala Days, Tollywo

అంతే కాదు చివరి రోజుల్లో అపార్ట్మెంట్ వాచ్ మెన్ ఉండే గదిలో ఉంది చివరి రోజులను వెళ్లదీశాడు.అయితే అయన ఆరోగ్యం బాగా క్షీణించడం తో ఆసుపత్రి లో జాయిన్ అయితే ఆ ఆసుపత్రి డాక్టర్ నటుడు మురళి మోహన్ కి ఫోన్ చేసి రాజనాల పరిస్థితి చెప్పడం తో అయన హుటాహుటిన వచ్చి చంద్ర బాబు నాయుడు( Chandrababu Naidu ) తో చెప్పి వైద్య ఖర్చులకు మొత్తం ప్రభుత్వం భరించేలా చేసాడు.ఇంకా కొంత మంది నటీనటులు తలా కొంత ఇచ్సి ఇంటికి కూడా పంపించాడు.ఆ డబ్బులు అయిపోయాక మళ్లి ఫోన్ చేసి డబ్బు అడిగితే అప్పుడు కూడా సహాయం చేసారు.

Telugu Chandrababu, Jayalalithaa, Murali Mohan, Rajanala, Rajanala Days, Tollywo

ఇక చివరికి మరల ఆరోగ్యం క్షీణించడం తో ఆంధ్ర లో వద్దు అని మరోమారు సహాయం కోరలేమని మురళి మోహన్( Murali Mohan ) గారి సహాయం తోనే చెన్నై లో జయలలిత దగ్గరికి పంపించారు.అక్కడికి వెళ్లిన ఆమెను కలిసే అవకాశం రాకపోవడం తో అక్కడే చనిపోయాడు రాజనాల.మళ్లి రాజనాల ఉండే ఎవరో మురళి మోహన్ కి ఫోన్ చేస్తే బాబు డబ్బు కోసం ఆలోచించకుండా ఫ్లైట్ లో ఆంధ్ర ప్రదేశ్ కి రప్పించి దహన సంస్కారాలు నిర్వర్తించారు.ఇది కేవలం మురళి మోహన్ పై ఉన్న అభిమానం కొద్దీ చంద్ర బాబు చేసారు అని కొంత మంది అంటారు కానీ చేయడం ఇష్టం లేకపోతే రాజకీయనాయకులకు ఎంత సేపు చెప్పడం పక్కన పెట్టేయడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube