టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే హీరోల్లో నిఖిల్ ఒకరు.హ్యాపీడేస్ తో తెరంగేట్రం చేసిన నిఖిల్ కు ఆ సినిమా సక్సెస్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది.
స్వామిరారా, కార్తికేయ సినిమాలు నటుడిగా నిఖిల్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.ప్రయోగాత్మక సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న నిఖిల్ ఒక దశలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా ఆ తర్వాత వరుస విజయాలతో సక్సెస్ లను చవిచూశాడు.
నిఖిల్ ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఒక సీరియల్ లో నటించాడు. నిఖిల్ ఇంటర్ చదివే సమయంలో అవకాశాల కోసం ప్రయత్నించగా ఈటీవీ సీరియల్ చదరంగంలో నిఖిల్ కు అవకాశం వచ్చింది.
నిఖిల్ నటించిన ఆ సీరియల్ హిట్ కావడం గమనార్హం.తాజాగా ఒక ప్రముఖ ఛానల్ టీవీ షోలో పాల్గొన్న నిఖిల్ తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చారు.
హీరోగా 17 సినిమాలు చేశానని మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నిఖిల్ చెప్పారు.చిన్నప్పుడు చర్మాస్ లో బొమ్మలు డబ్బులు పే చేయకుండా తీసుకెళ్లానని.
వాటిని మా అమ్మ నాన్న షాప్ లో తిరిగిచ్చేసేవారని అన్నారు.తన తల్లిదండ్రులిద్దరూ విద్యారంగంలో ఉన్నారని బేగంపేట, కాచిగూడలలో కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయని నిఖిల్ చెప్పుకొచ్చారు.
తాను ఇంజనీరింగ్ చదువుకున్నానని.తనకు గూగుల్ లో ఉద్యోగం వచ్చిందని నిఖిల్ చెప్పారు.
అయితే సినిమాల కోసం ఆ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకున్నానని తెలిపారు.అడిషన్స్ తోనే హ్యాపీడేస్ సినిమాలో అవకాశం వచ్చిందని.శేఖర్ కమ్ముల దయ వల్లే పరిశ్రమలోకి అడుగు పెట్టానని అన్నారు.పవన్ కళ్యాణ్, రవితేజలను తెలియకుండానే అనుకరించే వాడినని వాళ్లపై తనకు ఉండే అభిమానం వల్ల ఆ విధంగా జరిగేదని చెప్పారు.
సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతానని.జీవించేది తక్కువ రోజులు కాబట్టి ప్రపంచమంతా చూడాలని నిఖిల్ అన్నారు.