కళాతపస్వి కే విశ్వనాధ్ గారు గురువారం రాత్రి అనారోగ్య సమస్యలతో మరణించారు.ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ లెజెండరీ నటుడిని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ ఈయన మరణ వార్త పై సెలబ్రిటీలు స్పందిస్తూ తనకు నివాళులు అర్పిస్తున్నారు.
అదేవిధంగా ఎంతోమంది సీనియర్ నటీనటులు రాజకీయ నాయకులు కూడా విశ్వనాథ్ గారి ఆఖరి చూపు కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చంద్రమోహన్ హీరోగా నటించిన చిత్రం సిరిసిరిమువ్వ. ఈ సినిమా చంద్రమోహన్ సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పాలి.ఇందులో చంద్రమోహన్ డప్పు కొట్టుకొని జీవించే ఓ కళాకారుడి పాత్రలో నటించారు.
అయితే ఈ సినిమా గురించి చంద్రమోహన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను ఇన్ని సినిమాలలో నటించినా కూడా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించిన సిరిసిరిమువ్వ సినిమా తనకు చాలా సంతృప్తిని కలిగించిందని తెలిపారు.

ఇలా తన కెరియర్ ను ఓ మలుపు తిప్పిన విశ్వనాథ్ గారు ఇలా తుది శ్వాస విడిచి నిర్జీవంగా పడి ఉండటం చూసినటువంటి చంద్రమోహన్ ఒక్కసారిగా ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేక కుప్పకూలిపోయారు.ప్రస్తుతం చంద్రమోహన్ నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన విశ్వనాథ్ గారి ఆఖరి చూపు కోసం వచ్చారు.అయితే విశ్వనాధ్ గారి పార్థివ దేహాన్ని చూసిన చంద్రమోహన్ ఒక్కసారిగా వెక్కివెక్కి ఏడ్చారు.
ఇలా ఆయనని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.