తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.
గవర్నర్ తమిళిసై బయట పులిలా గర్జించారు…అసెంబ్లీలో పిల్లిలా వ్యవహారించారని విమర్శించారు.ఒకవేళ అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు.
అసెంబ్లీలో కనిపించాలని అనుకున్నారు.కనిపించారు అంతేనంటూ ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే గవర్నర్ తమిళిసై నడిచారని మండిపడ్డారు.తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్, గవర్నర్ మధ్య రాజీ కుదిరిందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ లో ‘బి’ ఉంది…గవర్నర్ మూడో ‘బి’ అంటూ ఎద్దేవా చేశారు.