ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లు తమ బస్సు లను నడుపుకోవాలని ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని, ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.విజయవాడ హోటల్ జాడే షూట్స్ లో సోమవారం బస్సు అండ్ కార్ ఆపరేటర్స్ కన్ఫెడరేషన్ అఫ్ ఇండియా మరియు ఆంద్ద్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా మంత్రి పేర్ని నాని పాల్గొని ” వన్ బస్ వన్ ఇండియా ” ఆన్ లైన్ యాప్ ను అయన ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ దేశంలోని ప్రైవేట్ ఆపరేటర్స్ లు అందరూ కలిసి ఉండాలని అప్పుడే మీరు చేస్తున్న వృత్తిలో మరింత రాణించ గలుగుతారని మంత్రి అన్నారు.ఆన్ లైన్ టికెట్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ లకు మరింత మేలు కలుగుతుందని మంత్రి అన్నారు.
,/br>
కరోనా సమయంలో ప్రైవేట్ ఆపరేటర్ లు చేసిన సహాయం మరువలేనిదని వారి దగ్గర పని చేసే ఉద్యోగులను కరోనా కష్ట్ర కాలంలో ఆడుకోవడంతో పాటు ప్రజలకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఇతర వైద్య సహాయాన్ని అందించి వారు తమ మానవత్వాన్ని చాటు కున్నారని ఈసందర్భంగా మంత్రి అభినందించారు.ఈ సమావేశంలో కె.టి.రాజశేఖర్, అశోక్, నాని, గౌతమ్ కిరణ్, సాంబ రెడ్డి, ప్రసన్న పట్వా ధన్, అఫ్జల్, హర్ష కోటక్, తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి పేర్ని నాని ని అస్సోసియేషన్ ప్రతినిధులు పూల మాలతో సత్కరించారు.