Abhishek Bachchan : వరుసగా 29 సినిమాలు ఫ్లాప్.. అయినా మూవీ ఆఫర్లు.. అభిషేక్ బచ్చన్ జీవితం విచిత్రమంటూ?

సాధారణంగా ఒకటి లేదా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరో కెరీర్ అయిపోయిందని ఆ హీరో కెరీర్ పుంజుకోవడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఒక హీరో మాత్రం వరుసగా 29 సినిమాలు ఫ్లాప్ అయినా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Abhishek Bachchan Flop Movies List Details Here Goes Viral In Social Media Boll-TeluguStop.com

ఆ హీరోనే అభిషేక్ బచ్చన్ కావడం గమనార్హం.అమితాబ్ కొడుకు అయిన అభిషేక్( Abhishek Bachchan ) ఎంతో కష్టపడినా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోలేకపోయారు.

అభిషేక్ నటించిన ఒకటి రెండు సినిమాలు సక్సెస్ సాధించినా రెప్యూజీ తర్వాత ఆయనకు వరుస షాకులు తగిలాయి.అభిషేక్ సినిమాలలో ఏకంగా 29 సినిమాలు అంచనాలను అందుకోకపోవడంతో ఆయన ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు.అభిషేక్ నటించిన ఘూమర్ మూవీ ( Ghoomer )త్వరలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.అభిషేక్ బచ్చన్ మొత్తం ఆస్తుల విలువ 300 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

ఏడాదికి 20 కోట్ల రూపాయల రేంజ్ లో అభిషేక్ బచ్చన్ సంపాదన ఉందని సమాచారం అందుతోంది.అభిషేక్ జీవితం విచిత్రమైన జీవితం అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో అభిషేక్ బచ్చన్ కు భారీ హిట్లు దక్కుతాయేమో చూడాలి.అభిషేక్ సక్సెస్ రేట్ తగ్గడం వల్లే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

అభిషేక్ తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటే మళ్లీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడం కష్టం కాదు.అభిషేక్ బచ్చన్ కు 2024 సంవత్సరం కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాలి.ఐశ్వర్యా రాయ్( Aishwarya Rai ) ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా అభిషేక్, ఐశ్వర్య విడాకులకు సంబంధించిన వార్తలు మాత్రం ఆగడం లేదు.అభిషేక్ కు లక్ కలిసిరాలేదని అందుకే సక్సెస్ కాలేదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube