దేశంలో సామాన్య పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల ఇప్పుడు దేశంలో మహామహుల పార్టీల అధినేతలకు టెన్షన్ పుట్టిస్తోంది.ఆనాడు 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలను ఓడించి అధికారంలోకి వచ్చింది.
అప్పటికే కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో ఉన్న బీజేపీఆప్ నీ చాలా లైట్ తీసుకుంది.కానీ కేజ్రీవాల్ ఊహించని దెబ్బ కొట్టారు.
అలా క్రమక్రమంగా ఢిల్లీలో రెండోసారి కూడా గెలిచినా ఆప్.ఇప్పుడు ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది.
ఆప్ జర్నీ చూస్తుంటే దేశంలో కాంగ్రెస్ ప్లేస్ రిప్లేస్ చేసే దిశగా దూసుకుపోతోంది.పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలవడం తెలిసిందే.
అయితే ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ లకు రెడీ అవుతోంది.జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ మా రాబోతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో గ్రామస్థాయి నుండి ఆప్ కి బలమైన కేడర్ తయారు చేస్తామని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండేలా పోరాడతామని.అంటున్నారు.ఈ సందర్భంగా మార్చి 23 అదేవిధంగా 24 వ తారీకులలో.లక్నోలో రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తెలియజేశారు.తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి వర్సెస్ సమాజ్వాది పార్టీ మధ్యాహ్న తరహాలో జరగటంతో ఇతర పార్టీలకు ఓటు పడలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.