బీజేపీ పార్టీ నుండి వెళ్ళిపోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి..!!

గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ( BJP ) నాయకురాలు విజయశాంతి పార్టీని వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా( Social media )లో రకరకాల కథనాలు వస్తున్నాయి.

 Vijayashanti Gave Clarity On The News Of Bjp Leaving The Party Vijayashanti, B-TeluguStop.com

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇటువంటి క్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీకి గుడ్ బై చెప్పటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో వస్తున్న ఈ వార్తలపై విజయశాంతి( Vijayashanti ) తీవ్రంగా ప్రతిస్పందించారు.తాను బీజేపీని వీడటం లేదని…బీజేపీ లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.

“రెండు రోజుల నుండీ రాములమ్మ బీజేపీ పార్టీతో దూరమవుతున్నారు… పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నవని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది.ఇది సరైనదో కాదో ప్రచారం చేసేటోళ్లకు తెలియాలి.నేనైతే మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, “గరళకంఠుని” సన్నిధానంలో ఆ ఆది దేవుని దర్శనార్థమై…హరహర మహాదేవ్”…మీ విజయశాంతి అనీ స్పష్టం చేయడం జరిగింది.తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన ఒక విజయశాంతి మీద మాత్రమే కాదు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Raj Gopal Reddy )వంటి నాయకులపై కూడా పార్టీ మారుతున్నట్లు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది.

వారు కూడా తాము బీజేపీ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube