ఇప్పుడిప్పుడే అవి నేర్చుకుంటున్నా.. శ్రీజ పోస్ట్ నెట్టింట్లో వైరల్!

శ్రీజ కొణిదెల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగిపోతోంది.శ్రీజ, భర్త కళ్యాణ్ విడిపోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

 Sreeja Konidela About Learning New Things, Sreeja, Kalyan Dev, Divorce, Post Vir-TeluguStop.com

కానీ ఆ వార్తలపై అటు శ్రీజ కానీ, ఇది కళ్యాణ్ దేవ్ కానీ అధికారికంగా స్పందించలేదు.ఆ వార్తల తర్వాత వారు కొంచెం దూరంగా ఉండటంతో ప్రేక్షకులు సృష్టిస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

మొదట్లో విడాకుల విషయం పై వస్తున్న రూమర్లను కొట్టిపారేసినప్పటికీ, ఆ తరువాత శ్రీజ తన ఇంస్టా హ్యాండిల్ లో తన భర్త పేరును తొలగించి కొణిదెల పేరును పెట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

దీనితో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమే అని అందరూ భావించారు.

కానీ ఈ విషయం పై మెగా ఫ్యామిలీ కూడా స్పందించలేదు.అంతే కాకుండా కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా భార్య శ్రీజ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఎటువంటి పోస్ట్ చేయలేదు.

కానీ కళ్యాణ్ దేవ్ శ్రీజ ల కూతురు నవిష్క విషెస్ చెబుతున్నట్టుగా ఇంస్టాగ్రామ్ లో వీడియోని షేర్ చేశారు.మొత్తానికి శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్ కూడా ఇటీవలే టూర్స్ తిరుగుతూ ఫుల్ చిల్ అవుతున్నాడు.

Telugu Divorce, Kalyan Dev, Sreeja-Movie

ఇదిలా ఉంటే తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది.ఆ పోస్ట్ లో శ్రీజ ఈ విధంగా రాసుకొచ్చింది.నేర్చుకోకుండా ఉండడం, తిరిగి నేర్చుకోవడం వంటివి నేర్చుకుంటున్నాను అంటూ శ్రీజ రాసుకొచ్చింది.

శ్రీజ ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసింది, ఆ పోస్ట్ కి అర్థం ఏమిటి అన్నది తెలియక చాలామంది తలలు పట్టుకుంటున్నారు.మొత్తానికి మెగా డాటర్ ఈ విడాకుల వ్యవహారం తో తరచుగా సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.

అంతేకాకుండా విడాకుల వ్యవహారం వచ్చిన తర్వాత నుంచి శ్రీజ కూడా సోషల్ మీడియాలో నిత్యం ఏదో రకమైన పోస్ట్ లు పెడుతూనే ఉంది.ఇటీవలే శ్రీజ తన అన్న రామ్ చరణ్ తో కలిసి టార్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube