తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి నివేదిక అందింది.
ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రూపొందించిన నివేదికను ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ కు అందించారని తెలుస్తోంది.
బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా తొలగించిన తరువాత బీజేపీ పరిస్థితి దిగజారిందని ఎమ్మెల్యేలు నివేదికలో పేర్కొన్నారు.కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.
అదేవిధంగా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బీజేపీ ఎమ్మెల్యేలు గుర్తించారు.తెలంగాణలో వారం రోజుల పాటు మహారాష్ట్ర, యూపీ, అస్సోం, గోవా, ఒడిశా, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన సంగతి తెలిసిందే.