అచ్చం అవయవం లాగానే ఉన్న మొక్క.. పిక్ వైరల్...

సముద్రంలో జంతువులే కాదు మొక్కలు కూడా చాలా వింతగా ఉంటాయి.ఆ చిత్ర విచిత్రమైన మొక్కలు చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.

 A Plant That Looks Like An Organ.. Pic Viral.., Sea Tulip, Emily Jenke, Strange-TeluguStop.com

తాజాగా అచ్చం అవయవాన్ని పోలి ఉన్న ఒక మొక్క సముద్రంలో నుంచి బయటికి కొట్టకొచ్చింది.ఆస్ట్రేలియా( Australia )లోని ఒక బీచ్‌కి వెళ్లిన వ్యక్తి రాక్ పూల్‌లో ఈ వింత మొక్కను కనుగొని దాని ఫోటోను ఫేస్‌బుక్‌( Facebook )లో షేర్ చేశారు.

అది తోకతో పాటు చిన్న మెదడు ఉన్నదానిలా కనిపించింది.ఆ ఫోటో చూసిన చాలా మంది గ్రహాంతర వాసి అని అనుకున్నారు.

కానీ కొంతమంది నిపుణులు అది ఏమిటో వెంటనే చెప్పగలిగారు.వారి ప్రకారం ఈ మొక్క ఒక సీ తులిప్.

నీటి అడుగున ఉండే ఒక రకమైన మొక్క ఇది.

Telugu Australia, Emily Jenke, Fieldclub, Rock Pool, Sea Tulip, Step Beach, Stra

బీచ్‌కి వెళ్లిన వ్యక్తి పేరు ఎమిలీ జెంకే.ఆమె “ఫీల్డ్ నేచురలిస్ట్స్ క్లబ్ ఆఫ్ విక్టోరియా” అనే గ్రూప్‌లో ఈ మొక్క ఫొటోను పోస్ట్ చేసింది.మొక్కను గుర్తించాలని ఆమె గ్రూప్ సభ్యులను కోరింది.

ఈ మొక్క చాలా గట్టిగా ఉందని చెప్పింది.ఫెయిర్‌హావెన్‌లోని స్టెప్ బీచ్‌లో ఆమె దానిని కనుగొంది.జనవరి 3న ఆమె ఫోటో పోస్ట్ చేయగా.1300 మందికి పైగా లైక్ చేశారు.దీనిపై పలువురు కామెంట్లు కూడా చేశారు.వారిలో కొందరు మొక్కను చూసి ఆశ్చర్యపోయారు.ఇది ఏదో మరో గ్రహం నుంచి వచ్చినట్లుగా ఉందని కొందరు చెప్పారు.వారిలో కొందరికి అది సీ తులిప్ అని గుర్తించగలిగారు.

Telugu Australia, Emily Jenke, Fieldclub, Rock Pool, Sea Tulip, Step Beach, Stra

సముద్రం ఎల్లప్పుడూ ఏదో ఒక వింత మొక్క లేదా జీవితం మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంద”ని ఒకరు కామెంట్ చేశారు.“ఇవి గ్రహాంతరవాసులలా కనిపించాయి!” అని మరొక వ్యక్తి పేర్కొన్నాడు. సీ తులిప్( Sea tulip ) మొక్క బోడిపెలతో కఠినమైన, ఎగుడుదిగుడుగా ఉండే చర్మాన్ని కలిగి ఉంటుంది.ఇది నారింజ, ఊదా, పసుపు లేదా పింక్ కలర్‌లో ఉండవచ్చు.

దాని చర్మంపై పెరిగే స్పాంజ్ నుంచి రంగు వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube