అచ్చం అవయవం లాగానే ఉన్న మొక్క.. పిక్ వైరల్…

సముద్రంలో జంతువులే కాదు మొక్కలు కూడా చాలా వింతగా ఉంటాయి.ఆ చిత్ర విచిత్రమైన మొక్కలు చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.

తాజాగా అచ్చం అవయవాన్ని పోలి ఉన్న ఒక మొక్క సముద్రంలో నుంచి బయటికి కొట్టకొచ్చింది.

ఆస్ట్రేలియా( Australia )లోని ఒక బీచ్‌కి వెళ్లిన వ్యక్తి రాక్ పూల్‌లో ఈ వింత మొక్కను కనుగొని దాని ఫోటోను ఫేస్‌బుక్‌( Facebook )లో షేర్ చేశారు.

అది తోకతో పాటు చిన్న మెదడు ఉన్నదానిలా కనిపించింది.ఆ ఫోటో చూసిన చాలా మంది గ్రహాంతర వాసి అని అనుకున్నారు.

కానీ కొంతమంది నిపుణులు అది ఏమిటో వెంటనే చెప్పగలిగారు.వారి ప్రకారం ఈ మొక్క ఒక సీ తులిప్.

నీటి అడుగున ఉండే ఒక రకమైన మొక్క ఇది. """/" / బీచ్‌కి వెళ్లిన వ్యక్తి పేరు ఎమిలీ జెంకే.

ఆమె "ఫీల్డ్ నేచురలిస్ట్స్ క్లబ్ ఆఫ్ విక్టోరియా" అనే గ్రూప్‌లో ఈ మొక్క ఫొటోను పోస్ట్ చేసింది.

మొక్కను గుర్తించాలని ఆమె గ్రూప్ సభ్యులను కోరింది.ఈ మొక్క చాలా గట్టిగా ఉందని చెప్పింది.

ఫెయిర్‌హావెన్‌లోని స్టెప్ బీచ్‌లో ఆమె దానిని కనుగొంది.జనవరి 3న ఆమె ఫోటో పోస్ట్ చేయగా.

1300 మందికి పైగా లైక్ చేశారు.దీనిపై పలువురు కామెంట్లు కూడా చేశారు.

వారిలో కొందరు మొక్కను చూసి ఆశ్చర్యపోయారు.ఇది ఏదో మరో గ్రహం నుంచి వచ్చినట్లుగా ఉందని కొందరు చెప్పారు.

వారిలో కొందరికి అది సీ తులిప్ అని గుర్తించగలిగారు. """/" / "సముద్రం ఎల్లప్పుడూ ఏదో ఒక వింత మొక్క లేదా జీవితం మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంద"ని ఒకరు కామెంట్ చేశారు.

"ఇవి గ్రహాంతరవాసులలా కనిపించాయి!" అని మరొక వ్యక్తి పేర్కొన్నాడు.సీ తులిప్( Sea Tulip ) మొక్క బోడిపెలతో కఠినమైన, ఎగుడుదిగుడుగా ఉండే చర్మాన్ని కలిగి ఉంటుంది.

ఇది నారింజ, ఊదా, పసుపు లేదా పింక్ కలర్‌లో ఉండవచ్చు.దాని చర్మంపై పెరిగే స్పాంజ్ నుంచి రంగు వస్తుంది.

వైరల్: నడి రోడ్డుపై కూలిన విమానం..