ఈ రోజుల్లో పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి.అప్రమత్తంగా లేకపోతే బయటికి వెళ్లే ప్రతి ఒక్కరూ చోరీలకు గురి అయ్యే ప్రమాదం ఉంది.
తాజాగా సారా( Sara ) అనే యువతి నుంచి ఒక దొంగ ఐఫోన్ 13 చాకచక్యంగా చోరీ చేశాడు.ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మతపరమైన యాత్ర కోసం వారణాసి( Varanasi )కి వెళ్లింది.
పర్యటనకు ముందు కొత్త ఐఫోన్ 13 కొనుగోలు చేసింది.అయితే ఆమె ఒక గుడి దగ్గర స్ట్రీట్ ఫుడ్ తింటుండగా ఓ దొంగ ఆమె గ్రహించకుండా చాలా తెలివిగా దానిని కొట్టేశాడు.ఈ సంఘటన గురించి ఎక్స్‌లో @shehjarr_ అనే యూజర్ నేమ్‌తో పంచుకున్నారు.2024, జనవరి 29 మధ్యాహ్నం 1:27 గంటలకు దొంగతనం జరిగిందని ఆమె వెల్లడించింది.కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి దశాశ్వమేధ ఘాట్‌కు సమీపంలో ఉన్న నై సరక్ చౌక్ సమీపంలో ఆగినప్పుడు ఇది జరిగిందని ఆమె తెలిపింది.మూడు నిమిషాల తరువాత జేబులోంచి తన ఫోన్‌ని ఎవరో తీశారని ఆమె తెలుసుకుంది.
విలువైన ఫోన్ తనకు తెలియకుండానే తన నుంచి పోవడంతో ఆమె ఎంతో కంగారు పడింది తల్లిదండ్రులకు చెప్తే వారు కూడా ఆందోళన చెందారు.
దొంగ ఐఫోన్( Apple iPhone 13 ) కొట్టేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఆమె తెలుసుకుంది ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.ఆ క్లిప్ లో దొంగ నల్లటి నైక్ స్వెట్ షర్ట్ ధరించి కనిపించాడు.సారా తన తల్లిదండ్రులతో కలిసి దుకాణదారుడి సీసీటీవీ ఫుటేజీ( CCTV footage ) కోసం అడిగామని చెప్పింది.
వారు పోలీసులకు చూపించగా, దొంగ ఎవరో తెలిసిందని పోలీసులు చెప్పారు.అతని పేరు విజయ్, దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు జైలుకు వెళ్లాడు.
అయితే సారా మాత్రం పోలీసుల తీరుతో సంతృప్తి చెందలేదు.తన ఫోన్‌ను కనుగొనడానికి లేదా దొంగను పట్టుకోవడానికి వారు ఏమీ చేయలేదని ఆమె చెప్పింది.ఎఫ్‌ఐఆర్ నివేదికలో ‘ఫోన్ దొంగిలించబడింది’ అని రాయడానికి బదులుగా ‘ఫోన్ పోయింది’ అని రాసేలా చేశారన్నారు.ఆమె ఎఫ్‌ఐఆర్ ఫొటోను కూడా షేర్ చేసింది.తన ఫోన్ లొకేషన్ వారణాసికి చాలా దూరంలో ఉన్న జార్ఖండ్( Jharkhand )లో ఉందని చెప్పింది.తన ఫోన్ తిరిగి వస్తుందని అనుకోలేదని చెప్పింది.
ఈ సంఘటన తన పర్యటనను నాశనం చేసిందని, తనను, తన కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా బాధించిందని ఆమె వాపోయింది.దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పింది.
దొంగ, అతనిలాంటి వ్యక్తులు ఆలయ ప్రాంతాన్ని అసురక్షితంగా మార్చారని కూడా ఆమె అన్నది.ఆ ప్రదేశంలోని ఆధ్యాత్మిక అనుభూతిని పాడుచేశారని సారా ఆగ్రహం వ్యక్తం చేసింది.
చాలా మంది ఆమె పోస్ట్‌ని చూసి జాలి పడ్డారు.కొందరు సొంత దొంగతనం కథనాలను, దానిని ఎలా డీల్ చేశారో కూడా పంచుకున్నారు.
ఆమెకు మద్దతు ఇవ్వడానికి, ఆమెకు కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించారు.