సింక్‌లో చేయి కడుక్కోడానికి బదులు కాలు కడుక్కున్న వ్యక్తి.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే..

ఈ ప్రపంచంలో చాలామంది ఇడియట్స్ ఉన్నారు.వారు ముందు ఏం జరగబోతుందనే విషయాన్ని అసలు ఆలోచించకుండా అనాలోచితంగా పనులు చేస్తుంటారు.

 A Person Who Washes His Feet Instead Of Washing His Hands In The Sink If You See-TeluguStop.com

చివరికి ఇతరులకి లేదా తమకు తామే హాని కలిగించుకుంటారు.అలాంటి వీడియోలను సీసీటీవీ ఇడియట్స్( CCTV idiots ) అనే ఒక వైరల్ పేజీ రోజూ షేర్ చేస్తుంటుంది.

తాజాగా అది షేర్ చేసి ఒక వీడియో ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.ఆ వీడియోలో ఒక వ్యక్తి తెలివి తక్కువగా ఆలోచించి బంగారం లాంటి హ్యాండ్ సింక్‌ పాడు చేశాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి సింక్‌( Sink ) వద్దకు వెళ్లి మొదటగా చేతులు కడుక్కోవడం చూడవచ్చు.తర్వాత అతడు ఆ సింక్‌లోనే కాలు కూడా కడుక్కుందాం అనుకున్నాడు.

అతను చాలా లావుగా ఉన్నాడు.కనీసం 100 కిలోల దాకా అతడు బరువు తూకవచ్చు.

అతడి కాళ్లు కూడా చాలా లావు, బరువుగా ఉన్నట్టు అనిపించింది.ఆ కాలు బరువుకి సింక్ ఆగుతుందని అతడు అనుకోవడమే పెద్ద పొరపాటయింది.

సదరు వ్యక్తి చాలా బరువున్న తన కాలును సింక్ లో వేసి రుద్దటం మొదలుపెట్టాడు.కానీ ఆ బరువుకి ఆగక ఆ సింక్ విరిగిపోయింది.దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.చాలా శబ్దంతో సింక్ పడిపోగా ఎవరైనా చూస్తారేమో అని కొద్దిగా టెన్షన్ కూడా పడ్డాడు.తర్వాత విరిగిపోయిన పైపు నుంచి వాటర్ లీక్ అవుతుంటే మెయిన్ ట్యాప్ ఆఫ్ చేశాడు.ఆపై అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది.

ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటలకే ఐదు లక్షల వ్యూస్ తో విస్తృతంగా వైరల్ అవుతోంది.దీనికి చాలా లైకులు కూడా వచ్చాయి.

మళ్లీ ఇలాంటి తెలివి తక్కువ పనిని అతడు జన్మలో చేయడు అని ఒక యూజర్ దీనికి ఫన్నీగా కామెంట్ పెట్టారు.ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించినట్లు మరొక యూజర్ అన్నాడు.

కాలు ఎలా కడుక్కోకూడదో ఇతడు పర్ఫెక్ట్ గా చేసి చూపించాడని ఇంకొక వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube