మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ), మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan )జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం సీతారామం ( Sitaramam ).ఒక అద్భుతమైన అందమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుని తాకింది.
ఇక ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ద్వారా తెలుగులో నటుడు దుల్కర్ సల్మాన్,నటి మృణాల్ ఠాకూర్ కు ఎంతో మంది అభిమానులు కూడా పెరిగిపోయారు.
ఇక ఈ సినిమా తర్వాత ఈమె ప్రస్తుతం నాని( Nani ) హీరోగా నటిస్తున్న తన 30వ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ఈమె బిజీగా ఉన్నారు.ఇలా ఒక వైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండే మృణాల్ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు ఒక నెటిజన్ నుంచి సీతారామం సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
సీతారామం సినిమాలో నటుడు దుల్కర్ సల్మాన్ చనిపోవడాన్ని ఎవరు ఊహించుకోలేకపోతున్నారు.అయితే ఆయన బ్రతికే ఉండి ఆ కథ మీద సీక్వెల్ చిత్రం వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు.ఈ క్రమంలోనే నేటిజన్ ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నిస్తూ… సీతారామం 2 సాధ్యమేనా అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు నటి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.సీక్వెల్ గురించి తనకు ఎలాంటి ఐడియా లేదని అయితే ఉంటే బాగుంటుందని తాను కూడా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి సమాధానం వైరల్ అవుతుంది.