న్యూఢిల్లీలోని గురుగ్రామ్( New Delhi ) లో రూ.2 కోట్ల విలువచేసే లగ్జరీ స్పోర్ట్స్ కార్ చెట్టును ఢీ కొట్టి క్షణాల్లో కాలి బూడిదైంది.అదృష్టవశాత్తు ప్రాణప్రాయం జరగలేదు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వివరాల్లోకెళితే.మన్ కీరత్ సింగ్ (35) ( Mann Kirat Singh )అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున గురు గ్రామ్ లో లగ్జరీ స్పోర్ట్స్ కారులో ప్రయాణిస్తూ కాస్త అదుపుతప్పి రోడ్డు పక్కన ఉండే చెట్టును ఢీకొట్టాడు.క్షణాల్లో ఇంజన్లో మంటలు చెలరేగాయి.మన్ కీరత్ చాకచక్యంగా వ్యవహరించి కాలిన గాయాలతో బయటపడడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు.కారు లో కేవలం ఒక్కడే ఒంటరిగా ప్రయాణించడంతో తనను తాను కాపాడుకోగలిగాడు.

కారు మాత్రం పూర్తిగా కాలిపోయి బూడిదైంది.కారు చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి.అంతే కాకుండా కారుకు సంబంధించిన విడిభాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లి పడ్డాయి.
ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే.? వేగంగా వెళుతున్న కారుకు అకస్మాత్తుగా కుక్క ఎదురు రావడం, కుక్క ను తప్పించబోయే క్రమంలో కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీ కొట్టింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ కావడంతో నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.

మన్ కీరత్ సింగ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్ పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.వేగం శృతిమించడంతోనే కారు అదుపు తప్పిందని, ఈ విషయం తెలిసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.కాబట్టి వాహనాలలో ప్రయాణించే వ్యక్తులు నియంత్రణ కోల్పోయే రీతిలో వాహనాలను నడిపితే ఇలాగే జరుగుతుంది అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి బైక్ పై వెళ్లేవారు, కార్ డ్రైవింగ్ చేసేవారు కాస్త జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.