WhatsAppలోకి అదిరిపోయే ఫీచర్... ఒకేదెబ్బకు చాలామందితో!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఇప్పుడున్న వినియోగదారులు చాలదన్నట్టు మరికొంతమందిని ఆకట్టుకొనే ప్రయత్నాలు అనునిత్యం చేస్తూనే వుంది.అవును, తాజాగా మరో ఆశ్చర్యకరమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

 A Feature That Can Be Pushed Into Whatsapp With Many People At Once-TeluguStop.com

ఈ ఫీచర్‌ ద్వారా మీరు ఒకేసారి ఎక్కువ మందితో చాటింగ్ చేసే అవకాశం కలదు.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లను డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే పరిచయం చేస్తోంది.

కాబట్టి మీరు WhatsApp డెస్క్‌టాప్ వెర్షన్‌లో ముల్టీపుల్ చాట్స్ ఫీచర్ ను చూడవచ్చు.అవును, WhatsApp డెస్క్‌టాప్ వెర్షన్‌లో సెలెక్ట్ మల్టిపుల్ చాట్స్ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది.

ఇది ఒకేసారి మరిన్ని చాట్‌లను తెరవడానికి ఉపయోగపడుతుంది.ప్రస్తుతం డెస్క్‌టాప్ వెర్షన్‌ని ఉపయోగించి, ఒకే సమయంలో చాలా మంది వ్యక్తులతో చాట్ చేయొచ్చు.ఒకే సందేశాన్ని చాలా మందికి పంపాలనుకునే వారికి ఈ ఎంపిక మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ యాజమాన్యం తెలియజేసింది.వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు జోడించిన ఈ కొత్త ఫీచర్లు వాట్సాప్ మొబైల్ వెర్షన్‌ను పోలి ఉంటాయి.

అయితే దీనిపై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అలాగే యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్లను త్వరలో ప్రవేశపెట్టనుంది.ఈ యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ద్వారా మీరు పొరపాటున పంపిన మెసేజ్‌ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ని వినియోగిస్తారు.ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు.

దీన్ని నివారించడానికి ‘యాక్సిడెంటల్ డిలీట్’ ఫీచర్లు ఇపుడు సహాయపడతాయి.ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ పరికరాల్లోని వినియోగదారులందరికీ ఇప్పుడు ఈ ఫీచర్‌లు త్వరలో అందుబాటులోకి వస్తాయి.WhatsApp దాని iOS 22.24.0.79 నవీకరణలో కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను పరిచయం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube