ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు లేనిదే రోజు గడవడం లేదు.ఏదో ఒక ప్రాంతంలో.
ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసినా ఇలాంటి దారుణాలే కళ్లకు కనిపిస్తున్నాయి.
అత్యాచారాలు, దాడులను అరికట్టేందుకు ఎన్ని కఠన చట్టాలు తెస్తున్నా.అవేమి పట్టించుకోని కొంతమంది నీచులు కామంతో కళ్లు ముసుకుపోయి దారుణంగా ప్రవరిస్తున్నారు.
ఇక ఆడవారిపైనే కాదు.అప్పుడప్పుడు మగవారిపై సైతం అత్యాచారం జరిగిన ఘటనలు చూస్తున్నాం.అయితే తాజాగా ఇలాంటి దారుణ ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది.మైనర్ బాలుడిపై ఓ యువతి అత్యాచారం చేసి.చివరకు అడ్డంగా బుక్ అయింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.టెక్సాస్ లో 24 ఏళ్ల జోయా అనే యువతి ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది.అయితే అదే ప్రాంతంలో ఉండే 13 ఏళ్ల మైనర్ బాలుడిపై ఆమె కన్నేసింది.
ఈ క్రమంలో సదరు మైనర్ బాలుడికి మాయమాటలతో ఇంటికి రప్పించుకుంది.అనంతరం అతడిపై దారుణంగా అత్యాచారంకి పాల్పడింది.ఈ విషయం బయట ఎవరికైనా చెబితే.నువ్వే అత్యాచారం చేశావని చెప్తానని బాలుడిని జోయా బెదిరించింది.
ఇక భయంతో సదరు బాలుడు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచేశాడు.అయితే బాలుడి ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఏంటని అరా తీయగా.
జోయా దారుణం బయటపడింది.
ఈ క్రమంలోనే జోయాపై బాలుడి తల్లిదండ్రులు కేసు పెట్టగా.
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని.అయితే జోయా జిత్తులమారి తెలివి తేటలతో.
తనకు జైపోలార్ డిజార్డర్ ఉందని పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.ఈ విషయాన్ని కనిపెట్టిన పోలీసులు ఆమె పట్టుకొని కోర్టులో హాజరు పరుచగా.
కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.