97 వేల మంది విద్యార్ధులకి కరోనా.. ట్రంప్ మళ్ళీ బుక్కయ్యాడుగా..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోన రక్కసి జూలు విదుల్చుతోంది.ప్రతీ రోజు వందల సంఖ్యలో అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వేల కేసులు నమోదు అవుతున్నాయి.

కరోనా మహమ్మారిని కంట్రో చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అన్నీ విఫలమవుతూనే ఉన్నాయి.అయితే ఇన్ని రోజులు చిన్న పిల్లలపై కరోనా ప్రభావం అమెరికాలో అంతగా చూపలేదు కానీ తాజాగా సుమారు 95 వేల మంది పిల్లలకి కరోనా సోకినట్టుగా ఓ వార్త పత్రిక సంచలన కధనం ప్రచురించడంతో పాటు ట్రంప్ వైఖరి కారణంగానే వీరికి కరోనా సోకిందని కుండబద్దలు కొట్టింది.

కరోనా అమెరికాలో ఎంట్రీ ఇచ్చిన తరువాత వివిధ కంపెనీల తో పాటుగానే స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవలు ప్రకటించారు.దాంతో పిల్లలకి కరోనా సోకకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు తల్లి తండ్రులు.

అయితే జులై నెలలో ప్రతీ ఒక్క విద్యా సంస్థలు ఓపెన్ చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.స్కూళ్ళు తెరువని పక్షంలో యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని ఒత్తిడులు తీసుకువచ్చారు.

Advertisement

ట్రంప్ హెచ్చరికలతో స్కూల్స్ తెరవక తప్పలేదు.అయితే

స్కూల్స్ తెరిచిన మొదటి రోజునే సుమారు 100 మంది విద్యార్ధులు కరోనా బారిన పడినట్టుగా తేలింది అయినా సరే ట్రంప్ మొండి వైఖరి కారణంగా స్కూల్స్ జులై నెలాఖరు వరకూ కొనసాగించారు.అయితే తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఒక్క జులై నెలలోనే సుమారు 97 వేల మంది విద్యార్ధులు కరోనా బారిన పడ్డారని తెలిపింది.ఈ వివరాల ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ ట్రంప్ ని ఏకిపారేసింది.

కేవలం ట్రంప్ మొండి వైఖరి కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని రాసుకొచ్చింది.ఇప్పటికే కారోనా కారణంగా రాజకీయ వైఫల్యాలని ఎదుర్కొంటున్న ట్రంప్ కి తాజాగా పరిణామాలు ఇరాకాటంలోకి నెట్టాయనండంలో సందేహం లేదని అంటున్నారు నిపుణులు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు