పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ బాల్య నటుడిగా చాలా సినిమాలు తీసాడు.ఆంధ్రా పోరి అంటూ పూరీ కొడుకు హీరోయిజాన్ని కూడా చూపించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా రాజ్ మదిరాజ్ డైరెక్షన్ లో ఒచ్చింది.మొదట సినిమాతోనే తన నటనతో డాన్స్ తో ఆకట్టుకున్నాడు ఈ కుర్రాడు.
ఆకాష్ కి చిన్నతనం నుంచీ సినిమాల మీద ఉన్న ఆసక్తి వల్లే అతన్ని హీరో చేసాను అంటున్నాడు డైరెక్టర్ పూరీ.అయితే అదే ఆకాష్ ఇప్పుడు తండ్రి డైరెక్షన్ చేస్తున్న రోగ్ సినిమా కి అసిస్టంట్ డైరెక్టర్ గా చెయ్యడం విశేషం.
ఇప్పటి వరకూ నటుడిగా తెర మీద కనిపించిన ఆకాష్ తెరవెనక కూడా పనిచేస్తాడు.ఇలా చెయ్యడం వలన తనకి డైరెక్షన్ మీద ఉన్న కోరిక కూడా తీర్చుకుంటున్నాడట.
కన్నడ నిర్మాత సి.ఆర్.మనోహర్ అన్న కుమారుడు ఇషాన్ ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు.ప్రియాంక చోప్రా కజిన్ అయిన మన్నార చోప్రా కథానాయిక.