మెగాస్టార్‌ చేస్తున్నది నచ్చడం లేదు

మెగాస్టార్‌ చిరంజీవి పద్దతిని స్వయంగా మెగా ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు.కొన్ని సంవత్సరాలుగా మెగా ఫ్యాన్స్‌ చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

 Chiranjeevi Fans Hurt With His Behaviour-TeluguStop.com

భారీ అంచనాలు పెట్టుకుని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నా కూడా విషయాన్ని పట్టించుకోకుండా చిరంజీవి కాలయాపన చేస్తున్నాడు.ఒక మంచి స్క్రిప్ట్‌ కోసం ఆగుతున్నాను అని చెబుతున్నా కూడా దానికి ఫ్యాన్స్‌ ఒప్పుకోవడం లేదు.

మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటికే చాలా సమయం వృదా అయ్యిందని, ఇంకా సమయం వృదా చేయడం సరైన పద్దతి కాదని అంటున్నారు.

చిరంజీవి తన 150వ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని, రీ ఎంట్రీతో రికార్డు బ్రేకింగ్‌ సక్సెస్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నాడు.అందుకోసం ఒక పక్కా కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథను వెదుకుతున్నాడు.

అయితే చిరంజీవి అలాంటి కథ ఎంతకు భించడం లేదు.దాంతో వచ్చిన ప్రతి కథను వెనక్కు పంపుతున్నాడు.

ఇప్పటికే వందలకు పైగా కథలు చిరు విన్నట్లుగా మెగా సన్నిహితులు చెబుతున్నాడు.ప్రస్తుతం చిరంజీవి దృష్టి తాజాగా తమిళంలో విడుదలైన ‘వేదాలం’ చిత్రంపైన ఉందని, దాన్ని రీమేక్‌ చేసే ఆలోచన చిరు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అయితే ఫ్యాన్స్‌ మాత్రం రీమేక్‌ అయినా పర్వాలేదు మరేదైనా పర్వాలేదు త్వరగా సినిమా చేయాలని చిరంజీవిని కోరుతున్నారు.మరి ఇప్పటికి అయినా చిరు తన సినిమాను ప్రారంభించి ఫ్యాన్స్‌ ఆగ్రహాన్ని చల్లార్చుతారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube