నేడు ‘బాహుబలి’ టీజర్‌!

తెలుగు ప్రేక్షకులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ‘బాహుబలి’ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా తెరకెక్కుతూనే ఉంది.

 Bahubali 5 Sec Teaser Release Today-TeluguStop.com

ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా ఆడియో మరియు టీజర్‌ను ఈనెల 31న గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న ప్లాన్‌ చేశాడు.

కాని భారీగా జరుపతలపెట్టిన ఈ కార్యక్రమంకు కొన్ని కారణాల వల్ల పోలీసులు అనుమతి ఇవ్వలేదు.దాంతో ప్రేక్షకులను నిరాశ పర్చడం ఇష్టం లేని జక్కన్న వారిని సంతోష పెట్టాలనే ఉద్దేశ్యంతో ఒక చిన్న టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించాడు.

ఆడియో మరియు టీజర్‌ విడుదలపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు.దాంతో ‘బాహుబలి’కి చెందిన అయిదు సెకన్ల టీజర్‌ను విడుదల చేయాలని జక్కన్న నిర్ణయించాడు.

ఈరోజు రాత్రి సమయంలో ఈ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తుంటే, అయిదు సెకన్ల టీజర్‌ రావడం కాస్త నిరాశను మిగిల్చినా కూడా దాని అయినా చూసి సంతోషిస్తాం అని కొందరు ప్రేక్షకులు అంటున్నారు.

ఇక హిందీలో టీజర్‌ను జూన్‌ 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్దం అయ్యాయి.అతి త్వరలో తెలుగు ఆడియో మరియు టీజర్‌ విడుదలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ఈ సినిమాను జులై 10న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube