ఆహా...ఏం సృజనాత్మకత...!

భాషలో పదాలు ఎలా పుడతాయి? ఎవరో ఒకరు సృష్టిస్తేనే కదా…! ‘మాయాబజార్‌’ సినిమాలో చిన్నమయ్యతో ఘట్కోద్గచుడు కూడా ఇదే మాట అంటాడు.ఇప్పడు సమాచార రంగంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రధానంగా మొబైల్‌ ఫోన్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో యూత్‌ కొత్త కొత్త పదాలను కాయిన్‌ చేస్తున్నారు.

 Nav Pe Charcha With French President-TeluguStop.com

సినిమాల్లో సృష్టించిన కొన్ని పదాలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి.లంచం, మామూళ్లు అనే పదాలకు ‘అమ్యామ్యా’ అని ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం.

ఇది బాపు-ముళ్లపూడి వెంకటరమణల సృష్టి.ఇలాంటివి ఇంకా అనేకమున్నాయి.

రాజకీయ రంగంలోనూ అనేక కొత్త పదాలను నాయకులు సృష్టిస్తున్నారు.రకరకాల నినాదాలు క్రియేట్‌ చేస్తున్నారు.

ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎన్నో పదాలు, నినాదాలు పుడుతుంటాయి.మోదీ సర్కారు, భాజపా కొత్త పదాలను సృష్టించడంలో అందెవేసిన చెయ్యని చెప్పొచ్చు.

ఎన్నికల సమయంలో భాజపా క్రియేట్‌ చేసిన ‘చాయ్‌పే చర్చ’ బాగా పాపులర్‌ అయింది.కాలేజీ విద్యార్థులు నలుగురు హోటల్లో కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకోవాలనుకుంటే ‘చాయ్‌పే చర్చా’ పెట్టుకుందాం అంటున్నారు.

ఈరోజు నుంచి ప్రధాని మోదీ విదేశాలకు బయలుదేరుతున్నారు.రేపు ఫ్రెంచ్‌ అధ్యక్షుడితో భేటీ అవుతారు.

వీరు ఎక్కడ మాట్లాడుకుంటారంటే నదిలో పడవ మీద వెళుతూ మాట్లాడుకుంటారు.అందుకే ఈ భేటీకి ‘నావ్‌పే చర్చ’ అని పేరు పెట్టారు.

పేరు, భేటీ రెండూ కొత్తగానే ఉన్నాయి కదూ…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube