డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్, యువ హీరో నితిన్‌ల కాంబినేషన్‌లో గత సంవత్సరం ‘హార్ట్ ఎటాక్’ మూవీ వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా యావరేజ్ టాక్‌తో పర్వాలేదు అనిపించుకుంది.
కలెక్షన్స్ కూడా నిర్మాతకు నష్టాలు ఏమీ కలుగకుండా వచ్చాయి.గత కొన్ని రోజులుగా పూరి జగన్నాద్ మరియు నితిన్‌ల కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం ఉన్న బిజీకి నితిన్‌తో పూరి ఇప్పట్లో సినిమాలు చేసే ఛాన్స్ లేదని కొందరు అనుకున్నారు.కాని మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అని, తాను త్వరలో పూరి దర్శకత్వంలో మరోసారి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా నితిన్ ప్రకటించాడు.
తనకు ఇష్టమైన దర్శకుడితో మరోసారి కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఎప్పుడెప్పుడు పూరితో మళ్లీ సినిమా చేస్తానా అని ‘హార్ట్ ఎటాక్’ పూర్తి అయినప్పటి నుండి కూడా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం చార్మితో ‘జ్యోతి లక్ష్మి’ సినిమాను తెరకెక్కిస్తున్న పూరి ఆ తర్వాత నితిన్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తక్కువ సమయంలో పూరితో వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడంతో నితిన్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు.ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించే అవకాశాలున్నాయని అంటున్నారు.