సత్యమూర్తి నో డౌట్‌

టాలీవుడ్‌ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’.అల్లు అర్జున్‌ హీరోగా, సమంత ప్రథమ హీరోయిన్‌గా నిత్యామీనన్‌ మరియు అదా శర్మలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది.

 S/o Satyamurthy Will Get U/a Censor Report-TeluguStop.com

ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇక ప్రమోషన్‌ కోసం అంటూ ఒక ప్రత్యేక పాటను తెరకెక్కిస్తున్నారు.

దాంతో సినిమాకు మరింత పబ్లిసిటీ రాబోతుంది.ఇక ఈ సినిమా విడుదల గురించి అనేక అనుమానాలు నిన్న మొన్నటి వరకు వచ్చాయి.

అయితే నేటితో ఆ అనుమానాలకు తెర పడ్డట్లయింది.

నేడు సెన్సార్‌ ముందుకు ఈ సినిమా వెళ్లింది.

సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాకు నేడు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వబోతున్నారు.చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాకు యూ కాని యూ/ఎ కాని రావచ్చని ఆశిస్తున్నారు.

సెన్సార్‌ పూర్తి అవుతుంది కనుక ఈ సినిమా వాయిదా పడే అవకాశాలే లేవని అంటున్నారు.వచ్చే నెల రెండవ వారంలో ఎప్పుడైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ బిజినెస్‌ అయ్యింది.విడుదలకు ముందే నిర్మాతకు టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube