సినిమాలు తెరపై పడటానికి ముందు పలు యాడ్స్ వస్తుంటాయి.అందులో ప్రధానమైనది పొగాకు ఉత్పత్తులను వాడటం మూలంగా కలిగే నష్టాలను వివరించే యాడ్.
ఇందులో ప్రధానంగా పొగాకు వల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి ఇబ్బందులు పడి చనిపోయిన వారి గురించి చూపిస్తారు.ఎట్టి పరిస్థితుల్లో పొగాకు ఉత్పత్తులను వాడకూడదనే ప్రచారం చేస్తారు.
అయితే చాలా మంది హీరోలకు సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్నా.ఆయా సందర్భాల్లో ఆ బ్యాడ్ హ్యాబిట్ కు దూరం అయ్యారు.ఇంతకీ సిగరెట్ వదులుకున్న ఆ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కమల్ హాసన్

11 ఏండ్ల వయసులోనే కమల్ తొలి సిగరెట్ కాల్చాడు.విషయం తెలిసి వాళ్ల అమ్మ గట్టిగా మందలించింది.ఆ తర్వాత పొగతాగడం మానేశాడు.
మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు కూడా సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండేది.అలెన్ కార్ రాసిన క్విట్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివి సిగరెట్ మానేశాడు.కనీసం సినిమాల్లోనూ సిగరెట్ తాగడు మహేష్.
విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి సినిమా వరకు తను సిగరెట్ తాగేవాడు.ఈ సినిమా తర్వాత తను సిగరెట్ మానేశాడు.
రానా

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఇబ్బంది అయ్యిందట.అప్పుడు డైరెక్టర్ సిగరెట్ మానేస్తే వాయిస్ బాగా వస్తుందని చెప్పడంతో మానేశాడట.
రజనీకాంత్
12 డిసెంబర్ 2012 నుంచి తను సిగరెట్, మందు తీసుకోవడం మానేశాడట.దానికి కారణం తన ఆరోగ్య సమస్యలని రజనీ చెప్పాడు.
మమ్ముట్టి

సిగరెట్ తాగే అలవాటున్న మమ్ముట్టి 7 సంవత్సరాల క్రితం మానేశాడట.
రణ్ బీర్ కపూర్
సిగరెట్ స్మోకింగ్ చాలా చెత్త అలవాటు అంటాడు రణ్ బీర్.అందుకే తన బర్ఫీ మూవీ నుంచి తాగడం మానేశానని చెప్పాడు.