భారత రాజకీయాల్లోకి సుడిగాలి వేగంతో దూసుకు వచ్చాడు నరేంద్ర మోడీ.ఈయన గుజరాత్ నుండి ఒక్కసారిగా కేంద్ర రాజకీయాల్లో కీలక చక్రం తిప్పి, ఏకంగా ప్రధాని అయ్యాడు.
గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సంచలన విజయం సాధించి చాలా కాలం తర్వాత భారత దేశంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు.ఇక మోడీకి సోషల్ మీడియాలో కూడా అభిమాన గనం అధికంగానే ఉంది.
ప్రతి రోజు, తనకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు.మోడీ ట్విట్టర్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా కోటి పది లక్షలు.
అయితే ఈయన కంటే కూడా ఇండియాలో మరో ఇద్దరు అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు.
బాలీవుడ్ బిగ్‌బి అమితాబచ్చన్ మరియు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌లు మోడీని మించి ట్విట్టర్‌లో ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు.
కొన్ని రోజుల ముందు వరకు మోడీ తర్వాతి స్థానంలో ఉన్న షారుఖ్ తాజాగా తన ఫ్యాన్స్ సంఖ్యను ఏకంగా కోటి ఇరువై లక్షలకు పెంచుకున్నాడు.ఇక అందరి కంటే ఎక్కువగా కోటి ముప్పై లక్షలతో అమితాబచ్చన్ ప్రథమ స్థానంలో ఉన్నాడు.
మోడీ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.త్వరలోనే మోడీ ఫాలోవర్స్ సంఖ్య ఈ ఇద్దరిని దాటవేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.