లక్నోలోని( Lucknow ) పారా ఏరియాలో జరుగుతున్న పెళ్లి వేడుకలో( Wedding ) ఊహించని సీన్ కనిపించింది.సరిగ్గా వధువు మెడలో వరుడు తాళి కట్టే టైమ్‌లో ఒక్కసారిగా చిరుతపులి( Leopard ) ఎంట్రీ ఇచ్చింది.
అంతే, పెళ్లికి వచ్చిన వాళ్లంతా షాక్ తిన్నారు, భయంతో పరుగులు తీశారు.క్షణాల్లోనే అక్కడ మొత్తం గందరగోళం నెలకొంది.
పెళ్లికూతురు, పెళ్లికొడుకు, వాళ్ల కుటుంబ సభ్యులని వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు హుటాహుటిన రాత్రి 11:40 గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్నారు.యూపీ 112 నుంచి వాళ్లకు ఎస్ఓఎస్ అలర్ట్ అందింది.కాన్పూర్ నుంచి ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు కూడా రెస్క్యూ టీమ్‌లో పాల్గొన్నారు.దాదాపు 200 నిమిషాల పాటు.అంటే మూడు గంటల పైనే కష్టపడి చిరుతని పట్టుకోవడానికి ట్రై చేశారు.
చివరికి దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి క్షేమంగా బంధించారు.
డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) సితాన్షు పాండే మాట్లాడుతూ “పట్టుబడ్డ చిరుత మగ చిరుత, దాని బరువు 80-90 కేజీలు ఉంటుంద”ని చెప్పారు.ఇది ఖేరీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని అనుకుంటున్నారట.చీఫ్ వార్డెన్ పర్మిషన్ తీసుకుని, దాన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తామని ఆయన తెలిపారు.
అధికారులు పెళ్లి మండపం మొత్తం గాలిస్తుంటే.రెండో అంతస్తులో విరిగిన ఫర్నిచర్ వెనుక చిరుత దాక్కుని కనిపించింది.ఫారెస్ట్ గార్డు ముఖద్దర్ అలీ దగ్గరికి వెళ్లగానే, ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.ఆయన కుడి చేతిని గట్టిగా గోళ్లతో గీరేశింది.వెంటనే ముఖద్దర్ అలీ వెనక్కి తగ్గడంతో, టీమ్ ట్రాంక్విలైజర్ డార్ట్ (మత్తు ఇంజెక్షన్) ఉపయోగించి చిరుతని కంట్రోల్ చేశారు.ముఖద్దర్ అలీకి ఫస్ట్ ఎయిడ్ చేసి, ఆ తర్వాత హాస్పిటల్‌కి తరలించారు.
డీసీపీ (వెస్ట్ జోన్) విశ్వజీత్ శ్రీవాస్తవ చెప్పిన ప్రకారం.చాలా మంది పెళ్లికి వచ్చిన వాళ్లు మొదట దీన్ని జోక్ అనుకున్నారట.లేదంటే వీధి కుక్క అనుకున్నారట.కానీ చిరుత ఒక్కసారిగా జనం వైపు రావడంతో భయం మొదలైంది.
జనం ఒక్కసారిగా బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.ఏదేమైనా రెస్క్యూ టీమ్ వాళ్ల కష్టంతో చిరుతని క్షేమంగా పట్టుకున్నారు.
పెద్ద ప్రమాదం తప్పింది.