వ్యూహం అదిరింది బాబాయ్ .. ! 

ఎవరి అంచనాలకు అందని విధంగా, తన రాజకీయ వ్యూహాలతో అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతున్నారు జనసేన అధినేత,  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.( Deputy CM Pawan Kalyan ) పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యూహాలు అందరికీ అర్థమయ్యేందుకు కాస్త సమయం పట్టినా , సరైన రూట్ లోనే పవన్ రాజకీయం వెళ్తున్నట్లుగా అర్థం అవుతోంది.

 Deputy Cm Pawan Kalyan Strategies To Strengthen Janasena Party Details, Pavan Ka-TeluguStop.com

జనసేన( Janasena ) ఆవిర్భావం నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోవడంపై ఎన్నో విమర్శలు పవన్ పై వచ్చాయి.అసలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా , పార్టీని విజయవంతంగా ఎలా ముందుకు నడిపిస్తారనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి.

  అయితే పవన్ మాత్రం జనం మీద ఆధారపడి పార్టీని అనుకున్న విధంగా ముందుకు నడిపించాలనే ఆలోచనతోనే ఉన్నట్లు అర్థమవుతుంది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నప్పటికీ , క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై పవన్ పెద్దగా దృష్టి పెట్టలేదు.

Telugu Ap, Deputycm, Janasena, Janasena Candis, Janasenani, Pavan Kalyan, Pawan

 కార్యకర్తలతో పెద్దగా సమావేశాలు నిర్వహించలేదు.ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ బిజీ బిజీగా ఉండడంతో , పార్టీ కార్యక్రమాలకు పెద్దగా సమయాన్ని కేటాయించడం లేదు.అసలు బూత్ లెవెల్ లో పార్టీ బలోపేతం చేసినా ఉపయోగం ఉండదనే ఆలోచనతో మొదటి నుంచి పవన్ ఉన్నారు.అన్ని హంగులు ఉన్నా ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నాయనే లెక్కల్లోనే పవన్ ఉన్నారు.అందుకే పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పవన్ పెట్టుకున్నట్టు అర్థమవుతుంది.2014 లో పవన్ పార్టీ పెట్టినా,  ఎక్కడా పెద్దగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయలేదు .కేవలం కొన్ని జిల్లాల్లో తనకు నమ్మకమైన వారికి మాత్రమే జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించారు.

Telugu Ap, Deputycm, Janasena, Janasena Candis, Janasenani, Pavan Kalyan, Pawan

నాయకుల వల్ల ఓట్లు రావని,  పార్టీ మీద నమ్మకం ఉంటే జనం అండగా నిలబడతారని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.2014లో పార్టీ స్థాపించినా,  2019 ఎన్నికల్లో మాత్రమే ఆయన జనసేన గుర్తుతో బరిలోకి దిగారు .అన్ని స్థానాల్లోనూ పోటీ చేసినా,  కేవలం ఒక స్థానంలో మాత్రమే పార్టీ అభ్యర్థి గెలిచారు .పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందారు.తమపై నమ్మకం లేకనే ప్రజలు అండగా నిలబడలేదని అర్థం చేసుకున్నారు.2024 లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు.2 పార్లమెంట్ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.గ్రామస్థాయి నుంచి పార్టీ బలంగా ఉన్నా,  పెద్దగా ప్రయోజనం ఉండదని, నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని , అలాకాకుండా ప్రజల్లోకి పార్టీ వెళ్తే అభ్యర్థి ఎవరైనా గెలుస్తారనే పవన్ ధీమా నిజం అయ్యింది.ఇక పార్టీలో చేరిక విషయం పైన పద్దగా దృష్టి పెట్టడం లేదు .దీనికి కారణం తాను ముందు నుంచి భావిస్తున్న లెక్కల ప్రకారం పార్టీ జనాల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసిన వారంతా గెలుస్తారని పవన్ ధీమాతో కనపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube