పెళ్లి చేస్తున్న పూజారే ఇలా చేస్తే ఎలా.. వీడియో చూస్తే నమ్మలేరు..

పెళ్లి వేడుక( Wedding Celebration ) ఎప్పుడూ ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం తలపిస్తుంది.బంధువులు, స్నేహితుల మధ్య కొత్త జంట ఆశీర్వాదాలు తీసుకుంటుంది.

 Priest Throws Plate Of Flowers At Overly Excited Relatives During Wedding Video-TeluguStop.com

కానీ, ఓ పెళ్లిలో జరిగిన సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.

వధూవరులు పెళ్లి ప్రమాణాలు చేస్తుండగా, అతిథులు( Guests ) వారిపై పూలు చల్లుతున్నారు.

మొదట్లో అంతా బాగానే ఉంది.కానీ, కొందరు అతిథులు అతి ఉత్సాహంతో పూలను( Flowers ) బలంగా విసరడం మొదలుపెట్టారు.

పూలు వధూవరులకే కాకుండా, పెళ్లి జరిపిస్తున్న పూజారికి( Priest ) కూడా తగలడం మొదలైంది.ఎంత ఓపికగా ఉన్నా, పూజారికి చిర్రెత్తుకొచ్చింది.

విసుగుతో ఊగిపోయిన ఆయన, ఒక్కసారిగా చేతిలో ఉన్న పళ్లెం పూలు చల్లుతున్న గుంపు పైకి వేగంగా విసిరేశారు.అంతే, ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది.

ఈ సీన్ చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అతిథుల అత్యుత్సాహం, పూజారి కోపాన్ని చూపించే ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.అతిథులు పూలు విసరడం, అది కాస్తా శృతి మించడంతో పూజారి పళ్ళెం విసిరే దాకా వ్యవహారం వెళ్లడం చూసి అందరూ తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు అతిథుల ప్రవర్తనను తప్పుబడుతుంటే, మరికొందరు పూజారికి మద్దతు తెలుపుతున్నారు.ఇంకొందరైతే మీమ్స్, జోకులతో రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వధువు ప్రతిమా లాహ్రే, వరుడు ఇమాన్ లాహ్రే తమ పెళ్లిని సరికొత్తగా జరుపుకున్నారు.డిసెంబర్ 18న జరిగిన ఈ పెళ్లిలో మంగళసూత్రం, సింధూరం వంటి ఆచారాలకు స్వస్తి పలికారు.అంబేద్కర్ చిత్రం ముందు రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు.

వారి ఆధునిక ఆలోచనలకు ప్రశంసలు దక్కాయి.కానీ, ఈ పూల గొడవతో వారి పెళ్లి మరింత పాపులర్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube