తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరోస్ అయితే పాన్ ఇండియాలో తన సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధించబోతున్నాడు తద్వారా ఆయన ఎలాంటి విజయాలను అందుకోబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.మరి ఆయన చేస్తున్న ఈ సినిమా విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడనేది తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా రాజాసాబ్ సినిమా( Rajasaab ) విషయంలో ఆయన ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండానే మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తూ ఒక కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…మరి ఆయన ఇదే రీతిలో ముందుకు సాగితే మాత్రం సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా ఆయనకు భారీ రేంజ్ లో గుర్తింపైతే రాదనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు అంటే ఇంతకు ముందు అన్ని సీరియస్ మూడ్ లో ఉండే సినిమాలే నడుస్తున్నాయి.
ఇక కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించే సినిమాలను తను ఒకటి కూడా చేయలేకపోతున్నాను అనే రిగ్రేట్ ఫీల్ అయిన రాజాసాబ్ సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.మరి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ లోనే ఉంటున్న మారుతి( Maruthi ) ఎప్పుడు ఈ సినిమాని ఫినిష్ చేసి ముందుకు తీసుకొస్తాడు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా ఆ టైమ్ కి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియడం లేదు…
.