ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) కార్యక్రమాలు, ఆలోచనా విధానం వినూత్నంగా ఉంటాయి.నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన తిరిగి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీకి కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు.టీడీపీకి( TDP ) చావో రేవో అన్నట్లుగా సాగిన ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి.
ఈ నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన వారు ఒక రోజంతా సీఎం చంద్రబాబుతో కలిసి ఉండే అవకాశం కల్పించింది.దీనిలో భాగంగానే ‘‘ డే విత్ సీబీఎన్ ’’( Day With CBN ) అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలా స్వీడన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఉన్నం నవీన్ కుమార్‌ను( Unnam Naveen Kumar ) సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసానికి ఆహ్వానించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు.రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన ఎన్ఆర్ఐల( NRI ) కృషి అభినందనీయమని నవీన్‌ను చంద్రబాబు ప్రశంసించారు.అలాగే చంద్రబాబు నిర్వహించిన పలు శాఖల సమీక్షల్లో నవీన్ పాల్గొని పరిపాలనా కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించారు.
కాగా.చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎన్నికల సమయంలో వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్వగ్రామాలకు చేరుకుని కూటమి విజయం కోసం శ్రమించారు.ప్రజలను చైతన్యపరిచి కూటమికి ఓట్లు వేయించడంలో కీలకపాత్ర పోషించారు.
అలా ఎన్ఆర్‌టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు ఆధ్వర్యంలో రాష్ట్రానికి వచ్చారు ఉన్నం నవీన్.చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల విజయం కోసం నవీన్ శ్రమించారు.
కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి నియోజకవర్గాల్లోని దాదాపు 1800 మంది ప్రభావవంతమైన వ్యక్తులతో నవీన్ ఫోన్‌లో మాట్లాడారు.అలా కూటమి విజయం కోసం పనిచేసిన నవీన్‌ను గతంలో చెప్పిన విధంగా తన ఇంటికి పిలిపించి సర్‌ప్రైజ్ చేశారు చంద్రబాబు నాయుడు.