జపాన్‌లో ( Japan )ఎక్కడ చూసినా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తుంది.చివరికి టాయిలెట్లలో కూడా వీళ్లు టెక్నాలజీ వాడేస్తున్నారు.
ఇక అక్కడ బుల్లెట్ ట్రైన్లు చాలా ఫేమస్.వాటిలో ఉపయోగించిన టెక్నాలజీ లగ్జరీ ఫెసిలిటీస్ కి ( technology luxury facilities )ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.
ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరూ చూడనీ మోస్ట్ లగ్జరియస్ జపనీస్ ట్రైన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టోక్యో నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రకం రైలు వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
సఫైర్ ఒడోరికో అనే ఈ రైలు చాలా లగ్జరీగా ఉంటుంది.ప్రైవేట్ క్యాబిన్లు, కంఫర్టబుల్ సీట్లు, రెస్టారెంట్ కార్, పెద్ద బాత్రూమ్లు ఇలా ప్రతి ఒక్కటి సెవెన్ స్టార్ హోటల్లోని సౌకర్యాల వలె కనిపిస్తున్నాయి.
ఈ రైలు టోక్యో నుంచి ఇజు పెనిన్సులా వరకు వెళ్తుంది.దారిలో కనిపించే సముద్ర తీరం అందంగా ఉంటుంది.వీడియోలో ఒక యువతి ఈ రైలు ఎంత బాగుందో చెప్పింది.ఈ రైలులోని సీట్లు చాలా స్పెషల్.
వీటిని తిప్పి కిటికీ వైపుకు పెట్టుకోవచ్చు.అప్పుడు కిటికీ ద్వారా బయట అందాలను చూస్తూ ప్రయాణం చేయవచ్చు.
ఆ వీడియోలో ఆ యువతి మనకు మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది.టోక్యో( Tokyo ) నుంచి ఇటో వరకు ప్రయాణించాలంటే ఒక్కొక్కరికి 54 డాలర్లు అంటే దాదాపు 5000 రూపాయలు చెల్లించాలి అని.ఈ రైలులో ఒక రెస్టారెంట్ కూడా ఉంది.అక్కడ చాలా రకాల స్పెషల్ ఫుడ్, డ్రింక్స్, కుకీలు దొరుకుతాయి.
కానీ ఈ రైలులో చాలా బాగున్నది సీట్లు.
ఈ రైలులో ప్రైవేట్ గదులు కూడా ఉన్నాయి.ఆ గదుల్లో ఆరుగురు వరకు ప్రయాణించవచ్చు.ఆ యువతి చెప్పినట్లు ఈ రైలులో సాధారణ సీటు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఇది చిన్న దూరం ప్రయాణించే విమానంలో బిజినెస్ క్లాస్ సీటులా ఉంటుంది.వీడియో చివర్లో ఆ యువతి బాత్రూమ్ని చూపించింది.బాత్రూమ్( bathroom ) చాలా పెద్దగా ఉంటుంది.అందులో పెద్ద అద్దం కూడా ఉంది.
ఆ వీడియోకు 90 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది.చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఒకరు, “జపాన్‌లో భవిష్యత్తు అనేది కేవలం ఒక ఆలోచనే కాదు, రోజువారీ ప్రయాణం” అని రాశారు.మరొకరు, “ఇది చాలా అద్భుతమైన రైలు ప్రయాణం.
ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్! నాకు చాలా ఇష్టం.జపాన్‌కు ఎలాంటి రైళ్లు చేయాలో తెలుసు!” అని రాశారు.”ఈ రకమైన రైళ్లలో ప్రయాణించి ఉద్యోగానికి వెళ్తే ఎంత బాగుంటుందో! చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది” అని మరొకరు కామెంట్ చేశారు.