బెంగళూరులో( Bengaluru ) ఎప్పటినుంచో ఉన్న సమస్య స్థానికేతరుల ఆధిపత్యం గురించి లోకల్స్ వాళ్ళు గొడవ పడడం.ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ మధ్యకాలంలో ఈ గొడవ మరింత తీవ్రం అవుతోంది.సినిమాల పరంగా ఈ విషయంలో వివాదాలు కూడా ఉన్నాయి.
కన్నడ సినిమాలకు( Kannada Movies ) థియేటర్లు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, కేవలం హిందీ తెలుగు తమిళ సినిమాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయని, దానివల్ల తమ సినిమాలు దెబ్బతింటున్నాయని కన్నడ సినిమా జనాలు తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే చాలాసార్లు ఆందోళనలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే.పరభాష సినిమాలకు థియేటర్లకు కేటాయింపు విషయంలో కొన్ని నిబంధనలు తప్పకుండా ఉండాలని అదేవిధంగా మల్టీప్లెక్స్ లో కన్నడ సినిమాలకు పర్టికులర్ స్క్రీన్లు షోలు ఇచ్చేలా రూల్స్ తేవాలని డిమాండ్ చేస్తున్నారు.కానీ ఇలాంటి రూల్స్ పెట్టడం ఎలా సమంజసమనే ప్రశ్న తలెత్తుంటుంది.
అదే చేస్తే మల్టీప్లెక్సులు మూసుకోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది.తాజాగా కన్నడ సినిమాకు వేరే భాషా చిత్రం వల్ల జరుగుతున్న అన్యాయం మీద మరోసారి చర్చ మొదలైంది.
కన్నడలో తాజాగా ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి( Ibbani Tabbida Ileyali ) అనే సినిమా రిలీజైంది.కిరిక్ పార్టీ, చార్లి 999, సప్తసాగరాలు దాటి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే అందించిన చిత్రమిది.
చంద్రజీత్ బెల్లప్ప దర్శకత్వంలో విహాన్ గౌడ, అంకిత అమర్ జంటగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రానికి చాలా మంచి టాక్ వచ్చింది.దీన్నో క్లాసిక్ అంటున్నారు.ఈ కన్నడ చిత్రానికి బెంగళూరులో చాలినన్ని థియేటర్లు ఇవ్వలేదు.మెజారిటీ థియేటర్లు, షోలను తమిళ మూవీ గోట్ సినిమాతో( GOAT Movie ) నింపేశారు.విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏమంత మంచి టాక్ రాలేదు.తొలి రోజు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ తర్వాతి రోజు సినిమా డల్ అయింది.
కానీ పరభాషా చిత్రం, పైగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి వందల కోద్దీ షోలు ఇచ్చి, మంచి టాక్ సంపాదించిన కన్నడ చిత్రానికి పదుల సంఖ్యలో షోలు కేటాయించడాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు.రెండు చిత్రాలకు కేటాయించిన షోలకు సంబంధించి బుక్ మై షో స్క్రీన్ షాట్లు తీసి ఎన్నాళ్లీ పరభాషా చిత్రాల ఆధిపత్యం అంటూ సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు కన్నడిగులు.
మరి ఇప్పటికైనా కన్నడ సినిమాలకు తగినన్ని స్క్రీన్లు ఇస్తారో లేదో చూడాలి మరి.