వీడియో: కుక్క పిల్లను చుట్టేసిన పాము.. తోటి కుక్కపిల్లలు ఎలా విడిపించాయో చూస్తే..?

ప్రస్తుతం కుక్క పిల్లలకు( Puppies ) సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇందులో రెండు కుక్కపిల్లలు తమ తోడబుట్టిన ఇంకొక కుక్క పిల్లను పాము దాడి( Snake Attack ) నుంచి రక్షించడానికి చాలా ధైర్యంగా పోరాడటం కనిపించింది.

 Brave Puppies Fierce Fight Off Snake To Save Their Mate Video Viral Details, Vir-TeluguStop.com

ఈ వీడియోను పోస్ట్ చేసిన @wildlife.vahsh అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రకారం, ఈ కుక్కపిల్లలు చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక దానికి ఒకటి సహాయం చేసుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

వైరల్ వీడియోలో( Viral Video ) ఒక చిన్న కుక్కపిల్ల మెడ చుట్టూ ఓ పెద్ద పాము చుట్టుకొని ఉండటం చూడవచ్చు.మొదట పరిస్థితి చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది.

పాము కుక్క పిల్ల మెడకు బలంగా చుట్టుకుంది.అలాంటి పరిస్థితులలో దాన్ని కాపాడేందుకు తోడబుట్టిన కుక్కపిల్లలు ముందుకు వచ్చాయి.

అవి చాలా ధైర్యంగా పాము తలను కరిచేస్తూ, బలవంతంగా లాగడం ప్రారంభిస్తాయి.

కొంత సమయంలోనే ఈ ఫైట్ చాలా సీరియస్ గా మారింది, ఎందుకంటే పాము కూడా చాలా బలంగా పోరాడుతుంది.తల్లి కుక్క చుట్టూ తిరుగుతూ, చాలా ఆందోళన చెందుతుంది, కానీ తన పిల్లలకు సహాయం చేయలేకపోతుంది.రెండు కుక్కపిల్లల ధైర్యం( Brave Puppies ) వల్ల మాత్రమే పాము తన పట్టును సడలించడం ప్రారంభిస్తుంది.

ఈ చిన్న కుక్క పిల్లలు పాము బాగా కొరుకుతూ లాగడం వల్ల పాము బాగా నొప్పిని అనుభవిస్తుంది.తన పట్టును విడువడం ప్రారంభిస్తుంది, చివరికి కుక్కపిల్ల మెడను వదిలేస్తుంది.

పాము నుంచి తప్పించుకున్న కుక్కపిల్ల తన తొడబుట్టిన ఇతర కుక్క పిల్లలతో కలిసి పాముని కొరికేస్తూ దానిపై ప్రతీకారం తీర్చుకుంటుంది.చివరికి ఆ సర్పం అక్కడి నుంచి పారిపోతుంది.ఈ వీడియో నుంచి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అని నెటిజన్లు అనుకుంటున్నారు.“చిన్నగా ఉన్నా ధైర్యం ఉంటే దేనినైనా ఎదుర్కోవచ్చు.” అని ఒకరు కామెంట్ చేశారు.ఐకమత్యమే మహాబలమని ఇంకొకరు అన్నారు.“రక్తసంబంధానికి మించింది మరొకటి లేదు, కష్టంలో ఉన్నప్పుడు తొడబుట్టిన వాళ్లే ఆదుకోవడానికి ముందుకు వస్తారు.” అని మరి కొంతమంది కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube