చీపురుతో ఊడుస్తున్న ఇవి చిత్తు కాగితాలు అనుకునేరు.. ఏంటో తెలిస్తే..?

ప్రతి ఒక్కరూ తమ జీవితం మెరుగుపరచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ధనవంతులు కావాలని కోరుకుంటారు.అందుకే చాలా మంది కష్టపడుతూ ఉంటారు.

 If You Know What These Scraps Of Paper That Are Being Swept With A Broom, Nri Ne-TeluguStop.com

ఎంతో కొంత డబ్బు సంపాదించి, సౌకర్యవంతమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.కొంతమంది ఉద్యోగంతో పాటు, ఇంకొన్ని వ్యాపారాలు కూడా చేస్తారు.

ఇలా చేయడానికి కారణం తమ ఆదాయాన్ని పెంచుకోవడమే.కానీ కొంతమంది మాత్రం ధనవంతుల కుటుంబాల్లో పుడతారు.

వారికి ఏదైనా కావాలంటే వెంటనే కొనుక్కోవచ్చు.డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం వారికి ఉండదు.

డబ్బును వారు చిత్తు కాగితాల్లాగా చూస్తుంటారు.

అలాంటి ఒక ధనిక మహిళకు ( rich woman )సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆవిడ ఇంటిని శుభ్రం చేస్తుంది.కానీ ఇంటి అంతటా చెత్త బదులు డాలర్ నోట్స్ పడి ఉన్నాయి.

ఆ తర్వాత ఆ నోట్లను చెత్త బుట్టలో వేస్తున్నట్లుగా వీడియోలో చూపించారు.అంటే వారింట్లో లెక్క లేనంత సొమ్ము ఉంది.

ఎంతగా అంటే అవి చిత్తు కాగితాల్లాగా వాళ్ళ ఇంటి చుట్టూ పడిపోయేంతలా! ఇలాంటి జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

@mrs.good.lucky అనే ఇన్‌స్టాగ్రామ్ పేరుతో పాపులర్ అయిన అనాస్టాసియా బాల్వనోవిచ్ అనే మహిళ ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో, ఆమె ఇంటి అంతటా నోట్స్ చెల్లాచెదురుగా పడిపోయాయి.వాటిని ఆమె కళ్లకు అద్దుకోవటం లేదు.చాలామంది కింద పడిపడిన డబ్బును చాలా జాగ్రత్తగా తీసుకుని వాటిని భద్రపరుచుతారు.ఆమె ఆ కాగితాలను చేత్తో తీయకుండా, ఒక వైపర్ లాంటి చీపురుతో నేల మీదకు తోస్తుంది.

ఆ తర్వాత ఆ కాగితాలను చెత్త బుట్టలో వేస్తుంది.అంత నోట్లు అన్ని చోట్ల పడి ఉన్నాయి కాబట్టి, ఎవరైనా వాటిని తీసి ఇవి ఏంటా అని పరిశీలించాలనిపిస్తుంది.

కానీ ఆమెకు అవి డబ్బు కాగితాలా లేదంటే చిత్తు కాగితాలా అనేది ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేస్తోంది.ఈమె ఒక ఫారినర్ అని తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారానో లేదంటే ఏదైనా వ్యాపారం ద్వారానో డబ్బులు సంపాదించి ఉంటుంది.వాటిని ఈ విధంగా షో చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube