ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌కు కీలక పదవి .. టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు

వృత్తి , ఉద్యోగ , వ్యాపారాల కోసం అమెరికాలో( America ) అడుగుపెట్టిన భారతీయులు ఇప్పుడు కీలకస్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.భారతీయుల శక్తి సామర్ధ్యాలు, ప్రతిభను గుర్తించి కీలక పదవులు వారిని కోరి వరిస్తున్నాయి.

 Indian-american Entrepreneur Arun Agarwal Named Vc Of Texas Economic Body Detail-TeluguStop.com

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్‌లో ఎంతోమంది భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్( Texas Governor Greg Abbott ) డల్లాస్‌కు చెందిన భారతీయ అమెరికన్, వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌ను( Arun Agarwal ) టెక్సాస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఈడీసీ) డైరెక్టర్ల బోర్డు వైస్ ఛైర్మన్‌గా నియమించారు.

Telugu America, Arun Agarwal, Dallas, Indianamerican, Joe Biden, Tedc Chairman,

టెక్సాస్ గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.ఎకనమిక్ డెవలప్‌మెంట్ , టూరిజం వంటి అంశాలలో టెక్సాస్ గవర్నర్ కార్యాలయానికి ఈ విభాగం బాధ్యత వహిస్తుంది.టెక్సాస్‌ను వ్యాపారంలో అమెరికాలో అగ్ర రాష్ట్రంగా చేయడంలో టీఈడీసీ( TEDC ) కీలకపాత్ర పోషిస్తుంది.ఆయన నియామకం వైవిధ్యం పట్ల టెక్సాస్‌ నిబద్ధతను నొక్కి చెబుతుంది.అలాగే ప్రధాన ఆర్ధిక పాత్రలలో భారతీయ అమెరికన్ నాయకుల ప్రభావాన్ని హైలైట్ చేస్తోంది.

Telugu America, Arun Agarwal, Dallas, Indianamerican, Joe Biden, Tedc Chairman,

నెక్ట్స్ సీఈవోగా అగర్వాల్.టెక్స్‌టైల్స్, కాటన్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో విస్తరించి ఉన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు.నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్‌సీఎల్) యూఎస్ఏ ఛైర్మన్‌గానూ ఆయన వ్యవహరిస్తున్నారు.

అలాగే ఇండియన్ అమెరికన్ సీఈవో కౌన్సిల్ కో చైర్‌గా, డల్లాస్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ బోర్డ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.యూఎస్ ఇండియా ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, టెక్సాస్ టెక్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల బోర్డు సభ్యుడుగానూ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు.

ఘజియాబాద్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీఏ, సదరన్ న్యూహాంప్‌షైర్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ పొందారు.టీఈడీసీ బోర్డు వైస్ ఛైర్మన్‌గా అగర్వాల్ నియామకం పట్ల భారతీయ అమెరికన్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube