వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నాడు, కట్ చేస్తే ఆ సినిమాకి 11 ఆస్కార్లు వచ్చాయి?

కళా రంగంలో అవకాశం రావడమే అరుదు.అలాంటిది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే కెరీర్ నష్టపోతారు.

 Facts About Leonardo Dicaprio ,leonardo Dicaprio, Titanic ,james Cameron, Holl-TeluguStop.com

అలా అతి ఆలోచనతో కొంతమంది కొన్ని క్యారెక్టర్స్‌ని చేజేతులా జారవిడుచుకుంటారు.ఆ తర్వాత తాము వదులుకున్న క్యారెక్టర్‌ని వేరే ఆర్టిస్టులు చేసి సక్సెస్‌ అయినపుడు బాధతో కుంగిపోతారు.

ఇలాంటి ఘటనలు సినిమా ఇండస్ట్రీలో అయితే చాలానే ఉంటాయి.అయితే అందరి విషయంలో అది నిజం కాకపోవచ్చు.

అవును, ‘టైటానిక్‌’ హీరో లియోనార్డో డికాప్రియో( Leonardo DiCaprio ) విషయంలో దానికి భిన్నంగా జరిగింది.ప్రపంచ సినీ చరిత్రలో మరపురాని ప్రేమకావ్యం పేరు ‘టైటానిక్‌( Titanic ).లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్‌స్లెట్‌ జంటగా నటించిన ఈ చిత్రం కలెక్షన్లపరంగా, అవార్డుల పరంగా చరిత్ర సృష్టించింది అని అందరికీ తెలిసిందే.

Telugu Hollywood, James Cameron, Kate Winslet, Oscars, Titanic-Movie

ఇంతటి ప్రభంజనం సృష్టించిన సినిమా అవకాశం వచ్చినా మన హీరో తన పొగరుతో చేజార్చుకునే పరిస్థితి నుంచి అదృష్టం అతన్ని వెనక్కి లాగిందని మీలో ఎంతమందికి తెలుసు? మొదట 1980లో కమర్షియల్‌ యాడ్స్‌లో నటించడం ద్వారా డికాప్రియో తన కెరీర్ని స్టార్ట్ చేసాడు.ఆ తర్వాత కొన్ని టెలివిజన్‌ కార్యక్రమాల్లో కనిపించాడు.ఆ తరువాత కాలంలో ఐదేళ్ళలో 9 సినిమాల్లో నటించాడు.ఆ సమయంలోనే డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌( James Cameron ) ‘టైటానిక్‌’ సినిమాకోసం జాక్‌ పాత్ర కోసం స్క్రీన్‌ టెస్ట్‌ నిర్వహించి ఎంతో మంది నటులతోపాటు డికాప్రియోను కూడా పిలిపించారు.అప్పటికే టెర్మినేటర్‌, అబిస్‌, అలియెన్స్‌, ట్రూ లైస్‌, టెర్మినేటర్‌ 2 వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు కావడంతో ఆ స్క్రీన్‌ టెస్ట్‌కి వచ్చేందుకు డికాప్రియో ఉత్సాహం చూపించాడు.

Telugu Hollywood, James Cameron, Kate Winslet, Oscars, Titanic-Movie

ఆల్రెడీ సూపర్ హిట్ సినిమాలు చేసి ఉన్న డికాప్రియో కామెరూన్‌ చెప్పిన డేట్‌కి కాకుండా రెండు రోజులు ఆలస్యంగా వెళ్ళాడు.అది కామెరూన్‌కి కోపం తెప్పించినా ఓపిక పట్టాడు.డికాప్రియో రాగానే స్క్రిప్ట్‌ అతని చేతికి ఇచ్చి చదవమన్నాడు కామెరూన్‌.దాంతో స్క్రిప్ట్‌ చదవమని అతని చేతికి ఇవ్వడం నచ్చలేదు మన హీరోకి.అందుకే తను చదవను అని దురుసుగా చెప్పాడట.దాంతో కామెరూన్‌కి పిచ్చి కోపం వచ్చింది.

స్క్రీన్‌ టెస్ట్‌కి వచ్చినందుకు ధన్యవాదాలు.ఇక బయల్దేరవచ్చు’ అని చెప్పాడు.

డికాప్రియో కూడా కోపంగా వెనుదిరిగినా తర్వాత కాస్త ఆలోచించి.మళ్ళీ వెనక్కి వచ్చి ఏమనుకున్నాడో ఏమో సైలెంట్‌గా కామెరూన్‌ చెప్పినట్టే చేశాడు.

అంతే.‘టైటానిక్‌’లో హీరోగా సెలెక్ట్‌ అయిపోయాడు.

ఆ తర్వాత వచ్చిన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించింది అనే విషయం అందరికీ తెలిసిందే.అలా పొగరుతో అక్కడి నుంచి వెళ్లిపోవాలకున్న డికాప్రియోను అదృష్టమే వెనక్కిలాగి బంగారు భవిష్యత్తును అందించింది అని ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube