నిత్యం ప్రతి ఒక్కరి ఇంట్లో వాడే కూరగాయల్లో ఉల్లిపాయలు( Onions ) ఒకటి.ఉల్లిపాయ లేనిదే ఏ కూర చేయలేరు.
వేల సంవత్సరాల నుంచి ఉల్లిపాయను వాడుతున్నాము.ఉల్లిపాయలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే సమ్మేళనాలు నిండి ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యపరంగా ఉల్లిపాయ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉల్లి రసం తాగితే ఎన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందుకోసం ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఒక చిన్న కప్పు ఉల్లి రసంలో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి.మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నిత్యం ఇలా చేశారంటే చాలా మేలు జరుగుతుంది.
కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి.అలాగే ఖాళీ కడుపుతో ఉల్లి రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల( Joint pain ) నుంచి ఉపశమనం పొందుతారు.
ఉల్లిపాయలో కాల్షియం మెండుగా ఉంటుంది.కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.
ఖాళీ కడుపుతో ఉల్లి రసం తీసుకోవడం వల్ల రక్తంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మీకు సహాయపడతాయి.ఉల్లిపాయల యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఇది ఒకటి.మధుమేహం ఉన్న వారు ఖాళీ కడుపులో తేనె కలపకుండా ఉల్లి రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్( Belly Fat ) తో బాధపడుతున్నవారు ఉదయాన్నే ఉల్లి రసం తీసుకుంటే చాలా మంచిది.ఉల్లి రసం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క్రమంగా కరిగిస్తుంది.బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.ఇక ఖాళీ కడుపుతో ఉల్లి రసం తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.అంగస్తంభన సమస్య దూరం అవుతుంది.లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.